Delhi High Court: పాస్‌పోర్టులో తండ్రి పేరు తొలగించండి..!

భర్తకు దూరమై ఒంటరిగా బిడ్డను పెంచిన ఓ తల్లికి అనుకూలంగా దిల్లీ హైకోర్టు(Delhi High Court) తీర్పునిచ్చింది. ఆమె వేసిన పిటిషన్‌ను పరిశీలించి కీలక ఆదేశాలు జారీ చేసింది.

Published : 02 May 2023 10:39 IST

దిల్లీ: బిడ్డ జన్మించకముందే వదిలివెళ్లిపోయిన తండ్రి పేరును పాస్‌పోర్టులో చేర్చాల్సిన అవసరం లేదని దిల్లీ హైకోర్టు(Delhi High Court) కీలక తీర్పు ఇచ్చింది. ఒక ఒంటరి తల్లి(Single mother) చేసుకున్న అభ్యర్థనను పరిశీలించిన కోర్టు ఈ మేరకు పాస్‌పోర్టు(Passport) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆమె మైనర్ కుమారుడు పాస్‌పోర్టులో నుంచి తండ్రి పేరును తొలగించాలని చెప్పింది. 

భర్త తోడు లేకుండా ఒంటరిగా బిడ్డను పెంచిన ఓ మహిళ తన మైనర్ కుమారుడి పాస్‌పోర్టు విషయంలో కోర్టులో పిటిషన్ వేశారు. కడుపులో ఉండగానే తన బిడ్డను తండ్రి వదిలివెళ్లిపోయాడని.. ఆ తర్వాత శిశువు బాధ్యతలు పూర్తిగా తానే చూసుకున్నానని అందులో పేర్కొన్నారు. తన మైనర్ కుమారుడి పాస్‌పోర్టులో తండ్రి పేరును తొలగించి కొత్తది జారీ చేయాలని కోరారు. పిటిషన్‌ పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్ తీర్పు వెలువరించారు. ‘తండ్రి బిడ్డను పూర్తిగా వదిలిపెట్టిన కేసు ఇది. మైనర్ కుమారుడి పాస్‌పోర్టు నుంచి తండ్రి పేరు తొలగించి కొత్తది జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి పేరును తొలగించడంతో పాటు ఇంటిపేరునూ మార్చుకోవచ్చు’ అని కోర్టు ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని