Vande Sadharan: ‘వందే సాధారణ్‌’ రైళ్లు వచ్చేస్తున్నాయ్‌.. వీడియో

రిజర్వేషన్‌లేని ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా వందే సాధారణ్‌ రైళ్లను భారతీయ రైల్వే తీసుకొస్తోంది. ఈ వారంలో వీటి ట్రైల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Published : 30 Oct 2023 17:18 IST

ముంబయి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్లు (Vande Bharat Express) దేశంలోని పలు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలను అనుసంధానిస్తూ సర్వీసులను అందిస్తున్నాయి. ఇప్పటి వరకు 34 వందే భారత్‌ రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలోనే రిజర్వేషన్‌లేని ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ‘వందే సాధారణ్‌’  (Vande Sadharan) రైళ్లను భారతీయ రైల్వే (Indian Railway) తీసుకొస్తోంది.

ఈ వారంలో వీటి ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇందుకోసం వందే సాధారణ్‌ రైలు ముంబయిలోని వాడి బండర్‌ యార్డుకు చేరుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వందే సాధారణ్‌ గురించి మరిన్ని విశేషాలు...

  • వందే భారత్‌ రైళ్ల తరహాలోనే వీటిని కూడా డిజైన్‌ చేశారు. ఇందులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. వీటిలో ఎనిమిది అన్‌ రిజర్వుడు బోగీలు, 12 స్లీపర్‌ బోగీలు కాగా, మిగిలిన రెండు లోకో మోటివ్‌లు. పుష్‌-పుల్‌ విధానంలో రైలు పనిచేస్తుంది.
  • ఒకేసారి 1,800 మంది ప్రయాణించవచ్చు. గంటకు 130 కి. మీ వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. వీటిలో ఏసీ కోచ్‌లు, ఆటోమేటిక్ డోర్‌లు ఉండవు. బోగీల లోపల అధునాతన సాంకేతికతో కూడిన వసతులుంటాయి.
  • తొలి రైలును దిల్లీ - ముంబయి మధ్య నడపనున్నారు. రెండో రైలును ఎర్నాకుళం - గువాహటి మధ్య  ప్రారంభించనున్నట్లు సమాచారం. తొలి దశలో ఐదు మార్గాల్లో వీటిని ప్రారంభించనున్నారు. తర్వాత మరో 30 రూట్లలో వీటిని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. 
  • ఈ కోచ్‌లను తమిళనాడులోని పెరంబూరులో ఉన్న ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ICF)లో డిజైన్ చేశారు. మూడు విభిన్న సాంకేతికతలతో మొత్తం 400 వందల వందే సాధారణ్ కోచ్‌లను తయారు చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని