7:11 PM: ఓటీటీలోకి వచ్చిన టైమ్‌ ట్రావెల్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

చైతు మాదాల దర్శకత్వంలో వచ్చిన టైమ్‌ ట్రావెల్‌ మూవీ ‘7:11 పీఎం’(7:11 PM). ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

Published : 09 Sep 2023 12:27 IST

హైదరాబాద్‌: టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘7:11 పీఎం’. తెలుగులో ఇలాంటి కథలు అరుదుగా మాత్రమే తెరకెక్కుతాయి. అలా రూపొందిన చిత్రమే ఇది. చైతు మాదాల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాహస్ పగడాల, దీపికా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. జులైలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇప్పుడీ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.  ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video) వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక ఇందులో రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు నటించారు.

కథ ఏమిటంటే: హంసలదీవికి చెందిన యువకుడు రవి (సాహస్ పగడాల) (Saahas Pagadala). ఎప్పుడూ తన ఊరు బాగుండాలని తపిస్తుంటాడు. విమల (దీపికా రెడ్డి)ని ప్రేమిస్తాడు. కొంతమంది స్వార్థపరుల కుయుక్తుల నుంచి గ్రామ ప్రజల్ని, వాళ్లు అపరిమిత మ్యూచ్‌వల్‌ ఫండ్ కంపెనీలో పొదుపు చేసుకున్న డబ్బునీ కాపాడే ప్రయత్నంలో ఉంటాడు. అనుకోకుండా ఆ ఊళ్లోకి వచ్చిన ఓ బస్సు ఎక్కుతాడు. కళ్లు తెరచి చూస్తే తను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రత్యక్షం అయినట్టు గ్రహిస్తాడు. రవి బస్సెక్కి రాత్రికి రాత్రే మెల్‌బోర్న్‌లో ఎలా దిగాడు? పైగా తను బస్ ఎక్కింది 1999లో అయితే మెల్‌బోర్న్‌ 2024 కాలం నడుస్తుంటుంది. మరి 25 ఏళ్ల కాలం తను ముందుకి ఎలా ప్రయాణం చేశాడు? 25 ఏళ్ల కిందటితో పోలిస్తే హంసలదీవి ఎలా మారింది? తను ప్రేమించిన విమల.. తన ఊరి ప్రజలు దాచుకున్న డబ్బు.. స్వార్థపరుల ప్రయత్నాల పరిస్థితులు ఏమిటి? రవి మళ్లీ తన గతానికి వెళ్లాడా? వెళ్లి ఏం చేశాడు అనేది ఓటీటీలో చూడాలి (7:11 PM Movie on amazon).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని