నిహారిక పెళ్లి: వాళ్లిద్దరే ఎందుకంటే..?

కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిహారిక కొణిదెల వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఉదయ్‌పూర్‌లో చాలా గ్రాండ్‌గా జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం పెళ్లికుమార్తెను చేయడంతో నాగబాబు నివాసంలో పెళ్లితంతు మొదలయ్యింది...

Updated : 15 Dec 2022 16:24 IST

సంగీత్‌-మెహందీల్లో సందడి చేసిన రీతూ-లావణ్య

ఇంటర్నెట్‌డెస్క్‌: కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిహారిక కొణిదెల పెళ్లి వేడుక ఉదయ్‌పూర్‌లో వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం జరిగిన హల్దీ వేడుకల్లో వధూవరులు పసుపు వర్ణపు దుస్తుల్లో మెరిసిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను నాగబాబు ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘ఉదయ్‌పూర్‌లోని ఆకాశానికి పసుపు రంగులద్దుతున్నాం’ అని అన్నారు. అయితే, శనివారం పెళ్లికుమార్తెను చేయడంతో నాగబాబు నివాసంలో పెళ్లితంతు మొదలయ్యింది. ఆ రోజు మెగా-అల్లు కుటుంబసభ్యులే కాకుండా ఇండస్ట్రీ నుంచి మెహర్ ‌రమేష్‌, లావణ్యత్రిపాఠి, గెటప్‌ శ్రీను.. నాగబాబు నివాసంలో సందడి చేసినట్లు పలు ఫొటోలు బయటకు వచ్చాయి.

కాగా, ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న వేడుకలో సైతం నటీమణులు రీతూవర్మ-లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకల్లో భాగంగా వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, బన్నీతో దిగిన ఫొటోలను వాళ్లిద్దరూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే నిహారిక.. రీతూ-లావణ్యను ఆహ్వానించడానికి ప్రత్యేక కారణముంది. వాళ్లు ముగ్గురూ.. మంచి స్నేహితులు మాత్రమే కాకుండా జిమ్‌మేట్స్‌ కూడా. వర్కౌట్ల అనంతరం జిమ్‌లో లావణ్య, రీతూలతో తీసుకున్న ఫొటోలనూ పలు సందర్భాల్లో నిహారిక షేర్‌ చేశారు. దీంతో ఇటీవల నిహారిక-చైతన్యల ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత రీతూవర్మ-లావణ్య.. ఆమెకు ప్రత్యేకంగా పార్టీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొట్టాయి.

వేడుకగా నిహారిక మెహందీ ఫంక్షన్‌ (ఫొటోలు)

ఇవీ చదవండి

అభిమానులను ‘ఖుషీ’ చేసిన అకీరా

#NISChay: డ్యాన్స్‌ చేసిన చిరు, అరవింద్‌ దంపతులు

Day1: నిహారిక పెళ్లి వేడుక వీడియో చూశారా?


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని