Shanmukh: ఎన్నో పరాజయాల తర్వాత సంతోషం కలిగింది: షణ్ముఖ్‌

గడిచిన కొంతకాలం నుంచి జీవితంలో ఎన్నో పరాజయాలు చవి చూశానని బిగ్‌బాస్‌ 5 ఫేమ్‌, ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ అన్నారు. ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’, ‘సూర్య’ వంటి లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వెబ్‌ సిరీస్‌లతో...

Updated : 04 Mar 2022 11:50 IST

వైరల్‌గా మారిన యూట్యూబర్‌  పోస్ట్‌

హైదరాబాద్‌: జీవితంలో ఎన్నో పరాజయాలు చవి చూశానని.. బిగ్‌బాస్‌ 5 ఫేమ్‌, ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ అన్నాడు. ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’, ‘సూర్య’ వంటి లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వెబ్‌ సిరీస్‌లతో బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌లను అందుకున్న అతడు.. వ్యక్తిగత జీవితంలో బ్రేకప్‌ బాధ పొందుతున్నాడు. సోషల్‌మీడియాలో క్యూట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్‌, అతడి ప్రేయసి దీప్తి గతేడాది చివర్లో విడిపోయారు. దీంతో షణ్ముఖ్‌ ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాడు. సరికొత్త వెబ్‌సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇదిలా ఉండగా, కోలీవుడ్‌ నటుడు సూర్య అంటే షణ్ముఖ్‌కు ఎంతో ఇష్టం. ఏదో ఒక రోజు సూర్యని కలవాలనుకుంటున్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపాడు. కాగా, ‘ఈటీ’ సినిమా ప్రమోషన్స్‌ కోసం సూర్య గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో షణ్ముఖ్‌ని సర్‌ప్రైజ్‌ చేసేందుకు అతడి స్నేహితులు.. సూర్యని కలిసే ఏర్పాట్లు చేశారు. గురువారం మధ్యాహ్నం సూర్యని షణ్ముఖ్‌ కలిశాడు. తన అభిమాన నటుడ్ని చూసిన వెంటనే భావోద్వేగానికి గురయ్యాడు. సూర్య.. షణ్ముఖ్‌ని ఆలింగనం చేసుకుని.. ‘‘నీ సిరీస్‌లు, రీల్స్‌ చూశాను. యాక్టింగ్‌ చాలా బాగుంది. భవిష్యత్తులో నువ్వు ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నా’’ అని ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘గడిచిన కొన్ని నెలలుగా ఎన్నో పరాజయాలు చవిచూసిన తర్వాత 3-3-2022 నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. లవ్‌ యూ సూర్య అన్నా’’ అని షణ్ముఖ్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని