Urvashi Rautela: సీఎం అంటూ పవన్‌ కల్యాణ్‌పై నటి పోస్ట్‌.. వెల్లువెత్తిన ట్రోల్స్‌

పవన్‌ కల్యాణ్‌ను ఏపీ సీఎం అని వ్యాఖ్యానించడంతో నటి ఊర్వశీ రౌతేలా నెట్టింట విమర్శులు ఎదుర్కొంటున్నారు.

Published : 28 Jul 2023 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను ఏ ఉద్దేశంతో పోస్ట్‌ పెట్టారోగానీ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) నెట్టింట విమర్శలు ఎదుర్కొంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)ని ఏపీ సీఎం అని వ్యాఖ్యానించడమే అందుకు కారణం. పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). ఇందులో ఆమె ఓ పాటలో నటించింది. సినిమా శుక్రవారం విడుదలకానున్న సందర్భంగా సామాజిక మాధ్యమం ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారామె. ‘బ్రో’ సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో తెరను పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సంబంధిత పోస్ట్‌పై ట్రోల్స్‌ వెల్లువెత్తాయి. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌’, ‘మీకు ఈ విషయం ఎవరు చెప్పారు?’, ‘పవన్‌ సీఎం ఎప్పుడయ్యారు?’, ‘ట్వీట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. కొందరు మీమ్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు.

‘బ్రో’ సినిమాకు వెళ్తున్నారా? ‘వినోదయసిత్తం’ గురించి ఇవి మీకు తెలుసా?

తమిళంలో హిట్‌ అయిన ‘వినోదయ సిత్తం’ సినిమాకి రీమేక్‌గా ‘బ్రో’ రూపొందింది. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని