Adivi Sesh: గేమ్‌ ఛేంజింగ్‌ ఫిల్మ్‌.. ఆసక్తి పెంచేలా అడివి శేష్‌ ట్వీట్‌

‘మేజర్‌’, ‘హిట్‌ 2’ విజయోత్సంలో ఉన్న హీరో అడివి శేష్‌ తదుపరి సినిమా ‘జీ 2’ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

Published : 21 Jul 2023 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మేజర్‌’ (Major), ‘హిట్‌ 2’ (HIT: The Second Case)ల విజయోత్సాహంలో ఉన్న యంగ్‌ హీరో అడివి శేష్‌ (Adivi Sesh) తన కొత్త సినిమా ‘జీ 2’ అప్‌డేట్‌ ఇచ్చారు. దాన్ని గేమ్‌ ఛేంజింగ్‌ ఫిల్మ్‌గా వ్యాఖ్యానించి, సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తించారు. ‘టాలీవుడ్‌లో వచ్చిన ది బెస్ట్‌ స్పై థ్రిల్లర్లలో ఇదొకటి’ అని పేర్కొంటూ ఓ నెటిజన్‌ ‘గూఢచారి’ (Goodachari) గ్లింప్స్‌ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. దానిపై స్పందించిన శేష్‌ సీక్వెల్‌పై ట్వీట్‌ పెట్టారు. ‘‘మీ ప్రేమకు ధన్యవాదాలు. గేమ్‌ ఛేంజింగ్‌ మూవీని అందించేందుకు దర్శకుడు వినయ్‌ కుమార్‌ సిరిగినీడి, రచయిత అబ్బూరి రవి ఆరు నెలలుగా కష్టపడుతున్నారు. ‘జీ2’ (G2) స్క్రిప్టు భారీ స్థాయిలో ఉండనుంది. వినయ్‌ కుమార్‌ విజన్‌ చూస్తుంటే అప్పుడప్పుడు నాకు భయమేస్తుంది. కానీ, నేను చెప్పబోయేది ఒక్కటే.. సినిమా అదిరిపోద్ది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘జీ 2’ని కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన ‘ప్రీ విజన్‌’ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

రివ్యూ: బవాల్‌.. జాన్వీ, వరుణ్‌ల ప్రేమకు, ప్రపంచ యుద్ధానికి లింకేంటి?

‘వెయిటింగ్‌ అన్నా’, ‘పార్ట్‌ 2.. పార్ట్‌ 1కి మించి ఉండాలి’, ‘సినిమాటిక్‌ యూనివర్స్‌ ప్లాన్‌ చేశారా?’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. శేష్‌ హీరోగా శశి కిరణ్‌ తిక్కా తెరకెక్కించిన ‘గూఢచారి’ బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2018లో విడుదలైన ఈ సినిమాకి కొనసాగింపుగా ‘జీ 2’ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఎడిటర్‌గా పనిచేసిన వినయ్‌ కుమార్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘గూఢచారి’ కథ మొత్తం భారతదేశంలోనే జరగ్గా.. రెండో భాగం అంతర్జాతీయంగా ఉండనుంది. తొలి భాగంలో కనిపించిన పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ‘జీ 2’లో కనిపించనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని