Adivi Sesh: క్యాన్సర్‌ బాధిత చిన్నారులతో అడవి శేష్‌.. హార్ట్‌ టచింగ్ వీడియో షేర్‌

హీరో అడవి శేష్ (Adivi Sesh) తాజాగా ఓ స్వచ్ఛంద సంస్థను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను పంచుకున్నారు.

Published : 04 Nov 2023 17:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యంగ్‌ హీరో అడవి శేష్‌ (Adivi Sesh) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అలాగే బయట జరిగే సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పొల్గొంటుంటారు. తాజాగా క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులను ఆయన కలుసుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థను సందర్శించిన ఆయన అక్కడ ఉన్న చిన్నారులతో కలిసి సందడి చేశారు. వాళ్లతో కలిసి ఆడిపాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

ముంబయిలోని ఓ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక దినోత్సవ వేడుకకు వెళ్లిన అడవి శేష్ అందులో ఉండే చిన్నారుల కోసం బహుమతులను తీసుకెళ్లారు. వాళ్లతో కలిసి డ్యాన్స్‌ వేసి వాళ్లను నవ్వించారు. ఆ రోజంతా వాళ్లతో గడిపారు. ఈ ఫొటోలను, వీడియోలను పంచుకున్న ఆయన తన జీవితంలో ఇవి మధురమైన క్షణాలన్నారు. ఆ చిన్నారులు తనలో ఆశను రేకెత్తించారని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘హార్ట్‌ టచింగ్‌గా ఉంది’ అని కామెంట్ పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘హిట్2’తో సూపర్‌ హిట్‌ను అందుకున్న అడవి శేష్‌ ప్రస్తుతం ‘గూఢచారి’ సీక్వెల్  ‘జి 2’ (Goodachari 2) పనుల్లో బిజీగా ఉన్నారు.  2024లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ కథల్ని ఓ ఫ్రాంచైజీగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని