Alia Bhatt: విమెన్స్‌ డే రోజు.. అలియా చెప్పిన గుడ్‌ న్యూస్‌ ఏంటంటే..?

బాలీవుడ్‌ కథానాయికలు ప్రియాంకా, దీపిక పదుకొణె.. తదితరులు హాలీవుడ్‌లోనూ తమ సత్తా చాటారు. తాజాగా అక్కడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరో బాలీవుడ్‌ నటి సిద్ధమవుతోంది.

Published : 08 Mar 2022 15:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బాలీవుడ్‌ కథానాయికలు ప్రియాంకా చోప్రా , దీపిక పదుకొణె.. తదితరులు హాలీవుడ్‌లోనూ తమ సత్తా చాటారు. తాజాగా అక్కడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరో బాలీవుడ్‌ నటి సిద్ధమవుతోంది. తనే అలియా భట్‌. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది అలియా.

‘‘జామి డోర్నన్, గాల్‌గోడ్‌ డట్‌ వంటి ప్రముఖ హాలీవుడ్‌ నటులతో కలిసి ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ అనే ఇంటర్నేషనల్‌ స్పై థ్రిల్లర్‌లో నటించనున్నా’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ దీని నిర్మాణ బాధ్యతలు చేపట్టనుంది. టామ్‌ హార్పర్‌ అనే బ్రిటిష్‌ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తాజాగా గంగూబాయి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ.. త్వరలో రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగు తెరకు పరిచయం కానుంది. వాటితో పాటు హిందీ చిత్రాలు ‘బ్రహ్మాస్త’, ‘డార్లింగ్స్‌’, ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు