Alia Bhatt: ఆ విషయంలో దర్శకధీరుడి సలహా పాటిస్తా: అలియా భట్

సినిమాలను ఎంపిక చేసే విషయంలో ఒత్తిడి ఉంటుందని అలియా తెలిపారు.

Published : 14 Mar 2024 14:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సినిమాల ఎంపిక విషయంలో తనకు రాజమౌళి సలహా ఇచ్చారని నటి అలియా భట్‌ (Alia Bhatt) తెలిపారు. ఆయన దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్ఆర్‌’లో నటించిన మెప్పించారు అలియా. తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దర్శకధీరుడు ఇచ్చిన సలహాను పంచుకున్నారు.

 ‘గామి’ గురించి కూడా నలుగురు పెద్ద మనుషులు మాట్లాడాలి: విశ్వక్‌సేన్‌

‘‘చిత్రాలను ఎంపిక చేసుకొనే విషయంలో నేను మొదటి నుంచి ఒత్తిడికి లోనవుతుంటాను. అదే విషయం రాజమౌళికి చెప్పాను. ‘ఏది ఎంచుకున్నా ప్రేమతో చేయండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులు మీ నటనను ప్రశంసిస్తారు. మీకు కనెక్ట్‌ అవుతారు. ఈ ప్రపంచంలో ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏదీ లేదు’ అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి అదే పాటిస్తున్నా. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నా వద్దకు వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు సహనం తక్కువ. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎంతకష్టమైన పాత్రనైనా అంగీకరించాలని నిర్ణయించుకున్నా’’ అని అలియా తెలిపారు. ప్రస్తుతం అలియా ప్రధానపాత్రలో  ‘జిగ్రా’ రూపొందుతోంది.వాసన్‌ బాలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తన ప్రొడక్షన్స్‌పై కరణ్‌ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. సామాజిక మాధ్యమాల వేదికగా సెట్స్‌ నుంచి కొన్ని ఫొటోలను అలియా పంచుకోగా అవి ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని