Allu Arjun: బ్రహ్మానందం నివాసంలో అల్లు అర్జున్‌ సందడి.. కారణం ఏమిటంటే?

అల్లు అర్జున్‌ (Allu Arjun) తాజాగా బ్రహ్మానందం ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Published : 26 Aug 2023 02:12 IST

హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) నివాసంలో నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) సందడి చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బ్రహ్మానందం నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహం చేసుకున్న బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్‌ - ఐశ్వర్య దంపతులకు అభినందనలు తెలిపారు. కుటుంబసభ్యులతో కాసేపు సరదాగా మాట్లాడుతూ గడిపారు.

ఇదిలా ఉండగా, ఉత్తమ నటుడిగా బన్ని జాతీయ అవార్డు సొంతం చేసుకోవడంపై బ్రహ్మానందం ఆనందపడ్డారు. పుష్పగుచ్ఛం అందచేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు అల్లు అర్జున్‌కు అవార్డు రావడంపై నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్‌, మయాంక్‌  హర్షం వ్యక్తం చేశారు. బన్నిని కలిసి ప్రత్యేకంగా అభినందించారు.

పార్థుడు రివ్యూ.. ప్రకాశ్‌ రాజ్‌ నటించిన పొలిటికల్‌ డ్రామా ఎలా ఉందంటే?

బ్రహ్మానందంతో అల్లు అర్జున్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఓసారి వేంకటేశ్వర స్వామి ఫొటోను స్వయంగా స్కెచ్‌ చేసి అల్లు అర్జున్‌కు బహుమతిగా అందించారు. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్‌ వివాహం ఆగస్టు 19న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల బన్ని పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే తాజాగా నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు