Kudi Yedamaithe review: రివ్యూ: కుడి ఎడమైతే
Kudi Yedamaithe review: వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
వెబ్‌సిరీస్: కుడి ఎడమైతే; నటీనటులు: అమలాపాల్, రాహుల్ విజయ్, రవి ప్రకాశ్, సూర్య శ్రీనివాస్, నిత్య శ్రీ, రుద్ర ప్రదీప్, తదితరులు; సంగీతం: పూర్ణ చంద్ర తేజస్వీ ఎస్.వి.; ఎడిటింగ్: సురేశ్ ఆర్ముగం; సినిమాటోగ్రఫీ: అద్వైత్ గురుమూర్తి; నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, పవన్‌కుమార్; రచన: రామ్ విఘ్నేష్; దర్శకత్వం: పవన్ కుమార్; విడుదల: ఆహా
కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి కథలు కొత్తేమీ కాదు. అయితే, కాలం అనే కాన్సెప్ట్‌ను ఎవరు? ఎలా ఉపయోగించుకుని ఆసక్తికరంగా మలిచారన్నదానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్‌సిరీస్ ‘కుడి ఎడమైతే’. ‘యూటర్న్’లాంటి విభిన్న కథను ప్రేక్షకులకు అందించిన పవన్‌కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఆహాలో విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ కథేంటి? అమలాపాల్, రాహుల్ విజయ్‌లు ఎలా నటించారు? పవన్‌కుమార్ ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటి?
కథేంటంటే: ఆది(రాహుల్ విజయ్) ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. మంచి నటుడు అవ్వాలని సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతుంటాడు. అది ఫిబ్రవరి 29, 2020. ఎప్పటిలాగే ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి ఒక అపార్ట్‌మెంట్‌కు వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గమనించి భయంతో బైక్‌పై బయలుదేరతాడు. ఒక మలుపు వద్ద సడెన్‌గా పోలీస్ జీపు ఆదిని ఢీకొంటుంది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోతాడు. ఆ జీపులో ఉన్న పోలీస్ ఆఫీసర్ దుర్గ(అమలాపాల్) తలకు కూడా గాయమై కొద్దిసేపటికి ఆమె కూడా చనిపోతుంది. అయితే, మళ్లీ మరుసటి రోజు ఉదయం ఎవరి ఇళ్లలో వాళ్లు నిద్రలేస్తారు. జరిగిన ప్రమాదం గుర్తుంటుంది కానీ, అది జరగడానికి కారణం ఏంటి? వాళ్ల జీవితంలో ఫిబ్రవరి 29 ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? వాటిని ఆది, దుర్గ ఎలా అధిగమించారన్నది చిత్ర కథ.
ఎలా ఉందంటే: ‘జీవితం సెకండ్ ఛాన్స్ ఇవ్వదు’ ఈ మాట చాలా సందర్భాల్లో వింటాం. అది వాస్తవం కూడా. ఎందుకంటే డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ, కాలం పోతే తిరిగిరాదు. జీవితంలో సెకండ్ ఛాన్స్ అనేది చాలా అరుదు. ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఉత్కంఠభరిత వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’. ఈ వెబ్‌సిరీస్ మొత్తం టైమ్ లూప్ ఊహాజనిత శాస్త్రీయ సంభవం అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక రోజులో జరిగిన సంఘటనలు మళ్లీ మళ్లీ జరగడం, వాటిని మార్చడానికి ప్రయత్నిస్తే, అనుకోని విపత్కర పరిస్థితులు ఏర్పడటం, ఎలాగైతే అలా అయిందని వదిలేస్తే ఊహించని విధంగా జరగడం. ఇదే తరహా టైమ్‌లూప్‌లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు కలిసి వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నించడం. కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నా జరిగిదే ఇదే.
ఆది, దుర్గలకు ఫిబ్రవరి 29వ తేదీన జరిగిన సంఘటనలే మళ్లీ మళ్లీ జరుగుతుంటాయి. వాటిని వాళ్లు మార్చడానికి ప్రయత్నించడం, అప్పుడు విచిత్ర పరిస్థితులు ఎదురవడం ఇలా సిరీస్ మొదటి నుంచి చివరి వరకూ జరిగిందే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే, వాళ్లు ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతారన్నది ఆసక్తిగా మలచడంలో దర్శకుడు విజయం సాధించాడు. రచయిత అనుకున్న కాన్సెప్ట్‌ను ఎలాంటి తికమకా లేకుండా చక్కగా తెరకెక్కించాడు. మొదటి మూడు ఎపిసోడ్స్‌లో అభి, దుర్గ, పార్వతి సహా పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్‌లను పరిచయం చేసుకుంటూ వెళ్లాడు. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఆరంభ సన్నివేశాలు పునరావృతం అవుతాయి. నాలుగో ఎపిసోడ్ దగ్గరి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఆది, దుర్గలు టైమ్ లూప్‌లో ఇర్కుపోయామని గుర్తించి కలిసి పనిచేయడంతో కథ, కథనాల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది. ఎపిసోడ్ చూస్తూ, తర్వాత ఇలా జరుగుతుందేమో అని ప్రేక్షకుడు ఊహించేలోపే ఊహకు అందని విధంగా కథ మలుపు తిరగడం రసవత్తరంగా ఉంటుంది. క్లైమాక్స్ వరకూ ఇదే బిగిసడలని కథా, కథనంతో కట్టిపడేశాడు దర్శకుడు. ముఖ్యంగా చివరి ఎపిసోడ్లో ఇద్దరూ ఈ టైమ్‌లూప్ నుంచి ఎలా బయటపడతారన్న ఆసక్తి చూసే ప్రేక్షకుడిలో తారస్థాయికి చేరుతుంది. చివరిలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్‌ను ఎవరూ ఊహించరు. ఈ సిరీస్‌కు కొనసాగింపు ఉంటుందని చెప్పకనే చెప్పాడు. ఇటీవల కాలంలో అలరించిన తెలుగు వెబ్‌సిరీస్‌లలో ‘కుడి ఎడమైతే’ మంచి థ్రిల్లర్.
ఎవరెలా చేశారంటే: సీఐ దుర్గగా అమలాపాల్ చక్కని నటన కనబరిచింది. ఎక్కడా కూడా పాత్ర పరిధి దాటి నటించలేదు. డెలివరీ బాయ్ ఆదిగా యువ నటుడు రాహుల్ విజయ్ ఒదిగిపోయాడు. నటుడు కావాలని అతను పడే తపన, ప్రేయసికి తన ప్రేమను వ్యక్తం చేయలేకపోయే నిస్సహాయ పాత్రలో విజయ్ హావభావాలు మెప్పిస్తాయి. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. పూర్ణ చంద్ర తేజస్వీ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేసింది. సినిమాటోగ్రాఫర్ అద్వైత్ గురుమూర్తి చాలా చక్కగా తీశారు. నైట్ ఎఫెక్ట్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సురేశ్ ఆర్ముగం ఎడిటింగ్ పర్వాలేదు. దర్శకుడు అనుకున్న కథను తికమకలేకుండా సన్నివేశాలను జత చేస్తూ వెళ్లారు. అయితే, నిడివి కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు. ఇక ఇలాంటి సినిమాలను తెరకెక్కించడం దర్శకుడికి కత్తిమీద సాములాంటిది. ఏమాత్రం తేడా కొట్టినా సినిమా అయినా, సిరీస్ అయినా అట్టర్‌ఫ్లాప్ అవుతుంది. అయితే, రచయిత రామ్ విఘ్నేష్, దర్శకుడు పవన్ చాలా చక్కగా ప్రతి సన్నివేశాన్ని రాసుకున్నారు. వచ్చిన సన్నివేశాలే వస్తున్నట్లు అనిపించడం ఒక్కటే మైనస్. బహుశా వెబ్ సిరీస్‌గానే తీయాలన్న ఉద్దేశంతో నిడివి విషయంలో అస్సలు ఆలోచించలేదనిపిస్తోంది. అదే సినిమాగా క్లుప్తంగా రెండున్నర గంటల్లో కథ చెప్పేసి ఉంటే మరోలా ఉండేదేమో. ఏదేమైనా ఒక చక్కని సస్పెన్స్ థ్రిల్లర్ చూసిన భావన ప్రేక్షకుడిలో కలుగుతుంది
బలాలు: + కథ, కథనాలు; + నటీనటులు; + రచన, దర్శకత్వం; + సాంకేతిక బృందం పనితీరు
బలహీనతలు: - చూసిన సన్నివేశాలే చూసినట్లు అనిపించడం; - పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం
చివరిగా: ‘కుడి ఎడమైతే’ ఎడమకు కుడి అవుతుంది.. ఎడమకు ఎడమ.. కుడికి కుడి.. అబ్బా ఈ తికమక వద్దు.. ‘కుడి ఎడమైతే’ చూసేయండి.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం