Balakrishna: బాలకృష్ణ.. టాక్‌ షో

నందమూరి బాలకృష్ణ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఓ వైపు వెండితెరపై కథానాయకుడిగా జోరు చూపిస్తూనే.. ఇప్పుడు ఓటీటీ వేదికగానూ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఆదివారం ప్రముఖ ఓటీటీ వేదిక ...

Updated : 30 Aug 2022 15:48 IST

నందమూరి బాలకృష్ణ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఓ వైపు వెండితెరపై కథానాయకుడిగా జోరు చూపిస్తూనే.. ఇప్పుడు ఓటీటీ వేదికగానూ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఆదివారం ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. బాలకృష్ణ తమ ఓటీటీ వేదిక కోసం ఓ టాక్‌ షో చేస్తున్నట్లు సదరు సంస్థ తెలియజేసింది. ఈ టాక్‌ షో తొలి ఎపిసోడ్‌ దీపావళి సందర్భంగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. దాదాపు పది మందికి పైగా స్టార్లతో ఈ షో తొలి సీజన్‌ను ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. ఈ టాక్‌ షో కోసం ‘అన్‌ స్టాపబుల్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ విడుదలకు సిద్ధమవుతుండగా.. గోపీచంద్‌ మలినేనితో చేయనున్న కొత్త చిత్రం పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని