NBK109: జోష్ పెంచిన బాలకృష్ణ.. కొత్త సినిమా షూటింగ్‌ మొదలు..

బాలకృష్ణ హీరోగా బాబీ (Bobby)దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్‌ ప్రారంభమైనట్లు చిత్రబృందం తెలిపింది.

Published : 08 Nov 2023 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియర్‌ నటుడు బాలకృష్ణ (Balakrishna) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘భగవంత్‌ కేసరి’తో హిట్ అందుకున్న ఆయన అదే జోష్‌తో తర్వాత సినిమాను ప్రారంభించారు. బాబీ (Bobby)దర్శకత్వంలో ఆయన ఓ ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన సంగతి తెలిసిందే. పోస్టర్‌తోనే ఆకట్టుకున్న చిత్రయూనిట్‌ తాజగా కొత్త అప్‌డేట్‌ను పంచుకుంది.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైనట్లు నిర్మాతలు తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ ‘బ్లడ్‌ బాత్‌కు బ్రాండ్‌ నేమ్‌.. వయలెన్స్‌కు విస్టింగ్‌ కార్డ్‌’ అనే క్యాప్షన్‌తో ఓ ఆసక్తికర పోస్టర్‌ను షేర్‌ చేశారు. పదునైన గొడ్డలి, దానిపై ఉన్న కళ్లజోడులో ఉగ్ర నరసింహస్వామి కనిపిస్తోన్న ఆ పోస్టర్‌ చూస్తుంటే బాబీ భారీ స్థాయిలో ప్లాన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమా #NBK అని పేరుతో ప్రచారంలో ఉంది. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు.

ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లి వేడుకలు షురూ.. ఫొటోలు వైరల్‌

‘భగవంత్ కేసరి’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ షురూ..
మరోవైపు ‘భగవంత్ కేసరి’ సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌కు మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. నవంబర్‌9న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌ వేదికగా ఈ సెలబ్రేషన్స్‌ జరుగుతున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’తో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. దీంతో బాబీ-బాలకృష్ణ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని