Bhagavanth Kesari Ott: ఓటీటీలో బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Bhagavanth Kesari Ott Release: బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘భగవంత్‌ కేసరి’ ఓటీటీలోకి వచ్చేసింది.

Published : 24 Nov 2023 01:54 IST

Bhagavanth Kesari Ott: బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆయన కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ కథా చిత్రం ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ (నవంబరు 24) మొదలైంది. బాలకృష్ణ (Balakrishna) నటన అనిల్‌ రావిపూడి టేకింగ్‌ సినిమాను నిలబెట్టాయి.

ఇంతకీ ఈ మూవీ క‌థేంటంటే: నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి (బాల‌కృష్ణ) అడ‌వి బిడ్డ‌. ఓ కేసులో జైల్లో శిక్ష అనుభ‌విస్తున్న‌ప్పుడు జైల‌ర్ (శ‌ర‌త్‌కుమార్‌) కూతురు విజ‌య‌ల‌క్ష్మి అలియాస్ విజ్జి పాప (శ్రీలీల‌)తో అనుబంధం ఏర్ప‌డుతుంది.  విజ్జిపాప‌ని ఆర్మీలో చేర్చాల‌నేది త‌న తండ్రి క‌ల. అనుకోకుండా జైల‌ర్ మ‌ర‌ణించ‌డంతో విజ్జి పాప బాధ్య‌త‌ల్ని భ‌గ‌వంత్ కేస‌రి తీసుకుంటాడు. ఆమెని ఓ సింహంలా త‌యారు చేయాల‌ని నిర్ణ‌యిస్తాడు. ఆ ప్ర‌య‌త్నం ఎలా సాగింది?సైకాల‌జిస్ట్ కాత్యాయ‌ని (కాజ‌ల్) ఎలా సాయం చేసింది? ఇంత‌కీ భ‌గ‌వంత్ కేస‌రి జైలుకి ఎందుకు వెళ్లాడు?ఆయ‌న గ‌త‌మేంటి?రాజ‌కీయ నాయ‌కుల్ని త‌న గుప్పెట్లో పెట్టుకుని ప్రాజెక్ట్ వి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న బిలియ‌నీర్ రాహుల్ సాంఘ్వీ (అర్జున్ రాంపాల్‌)తో ఉన్న వైరం ఏమిట‌నేది మిగ‌తా క‌థ‌.

సినిమా పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని