Sai Pallavi- Governor Dr Tamilisai: నటిపై ట్రోల్స్‌.. మండిపడ్డ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన చిత్రం ‘శ్యామ్‌సింగ రాయ్‌’. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వం వహించారు.  గతేడాది డిసెంబర్‌ 24న థియేటర్లలో తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలై  హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీ విడుదల అనంతరం.. ఈ చిత్రంలో సాయి పల్లవి అందంగా లేదంటూ తమిళంలో ఓ వార్త ప్రచురించారు.

Published : 30 Jan 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన చిత్రం ‘శ్యామ్‌సింగ రాయ్‌’. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వం వహించారు.  గతేడాది డిసెంబర్‌ 24న థియేటర్లలో తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలై  హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీ విడుదల అనంతరం.. ఈ చిత్రంలో సాయి పల్లవి అందంగా లేదంటూ తమిళంలో ఓ వార్త ప్రచురించారు. తాజాగా ఈవిషయం గురించి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మాట్లాడారు. సాయిపల్లవిపై చేసిన వ్యాఖ్యలు బాధిస్తున్నాయన్నారు.

విషయానికొస్తే.. నటి సాయిపల్లవి ఇందులో ఓ దేవదాసి యువతి ‘మైత్రి’గా కనిపించారు. కెరీర్‌లో తొలిసారి ఓ సున్నితమైన పాత్రను పోషించినామెకు మంచి మార్కులు పడ్డాయి. ప్రణవాలయ పాటలో ఆమె చేసిన నృత్యం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇలా ఓ పక్క ప్రశంసలు వెల్లువెత్తుతుంటే.. తమిళనాట దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి అందంగా లేదంటూ ఓ వార్త ప్రచురితమైంది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకంగా నిరసన వ్యక్తమైంది. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సాయిపల్లవిపై వచ్చిన వార్తలు బాధించాయంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ... ‘‘ సాయిపల్లవి గురించి బాడీ షేమింగ్ చేయడం నన్ను తీవ్రంగా బాధించింది. గతంలో నా రూపాన్ని ఎప్పుడూ ట్రోల్‌ చేసేవారు. అలాంటి మాటలు పడ్డవారికే ఆ బాధంటే ఏమిటో తెలుస్తుంది.. ఆ విషయంలో తీవ్రంగా బాధపడ్డా. కానీ నా ప్రతిభతో, నా శ్రమతో ఆ మాటలను ఎదుర్కొన్నా.అలాంటి కామెంట్స్‌ బారిన పడకుండా ఉండటానికి మనమేమీ మహాత్ములం కాదు. అయితే నాపై చేసిన కామెంట్స్‌ని పట్టించుకోలేదు.కానీ ఆ ట్రోలింగ్ బాధిస్తుందా అని అడిగితే.. కచ్చితంగా ‘ఔను’ అనే చెబుతాను” అన్నారు.

అలా పుట్టడం మన తప్పు కాదు..

పొట్టిగా.. డార్క్‌ స్కిన్‌తో, నాలాంటి (రింగుల) జుట్టుతో పుట్టడం మన తప్పు కాదు. వీటన్నింటిలోనూ అందం ఉంది. అందుకే ఓ సామెత ఉంది ‘‘ కాకి పిల్ల కాకికి ముద్దు అని’’. కాకి తన పిల్లను బంగారు పిల్లగా భావిస్తుంది. అంతేకానీ నల్లగా ఉందని వదిలిపెట్టదు కదా! స్త్రీలు ఎక్కువగా బాడీ షేమింగ్‏కు గురవుతారు. కానీ పురుషులు అలాంటి మాటలు ఎదుర్కోలేరు. 50 ఏళ్ల వయసులో ఉన్న పురుషులను యువకులుగా చూస్తారు.కానీ స్త్రీలు అలా కాదు. మహిళల ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఈ సమాజం... వారిని బాధపెట్టడం ద్వారా వారి ఎదుగుదలను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది’’ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని