Bro Censor: ‘బ్రో’ సెన్సార్‌ రిపోర్ట్‌.. ఆనందంలో చిత్ర బృందం

‘బ్రో’ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకి సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చిందంటే?

Published : 19 Jul 2023 19:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర నటుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు, హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). జులై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు (Central Board of Film Certification) ఈ సినిమాకి క్లీన్‌ ‘యు’ (U) సర్టిఫికెట్‌ జారీ చేసింది. సంబంధిత ఫొటోని నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, దర్శకుడు సముద్ర ఖని, సంగీత దర్శకుడు తమన్‌ అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా రన్‌టైమ్‌ 2 గంటల 16 నిమిషాలని సమాచారం.

‘ప్రాజెక్ట్‌ కె’.. ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ అదిరింది

తమిళంలో విజయవంతమైన ‘వినోదాయం సిథం’ (Vinodhaya Sitham) సినిమా ఆధారంగా ‘బ్రో’ని తెరకెక్కించారు. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు పలు మార్పులు చేశారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడం విశేషం. కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) కథానాయికలుగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణలో పవన్‌ కల్యాణ్‌ 21 రోజులు పాల్గొన్నారని సాయిధరమ్‌ తేజ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను 24 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నానన్నారు. ప్రారంభంలో దాదాపు 15 నిమిషాలు మినహా సినిమా అంతా పవన్‌ కల్యాణ్‌ కనిపిస్తారని అభిమానుల్లో ఆసక్తి పెంచారు. ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 22న, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని 25న నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని