Sardar: సినిమా హిట్‌.. డైరెక్టర్‌కు కారు గిఫ్ట్‌...

కార్తి నటించిన సర్దార్‌ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుని వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్ర నిర్మాత ఎస్ లక్ష్మణ్ కుమార్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌కు కారును బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

Published : 02 Nov 2022 19:14 IST

హైదరాబాద్‌: తమిళ హీరో అయినా అన్ని భాషల్లో సినీ ప్రియులకు సుపరిచితమైన నటుడు కార్తి(Karthi). ఈ ఏడాది ఈ యంగ్‌ హీరో వరుస విజయాలు అందుకుంటూ ఖుషీ అవుతున్నాడు. ఇటీవల విడుదలైన సర్దార్‌(Sardar) సినిమా కార్తి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుని నిర్మాతకు లాభాల పంట పండించింది. దీంతో ఈ సినిమా నిర్మాత ఎస్‌ లక్ష్మణ్‌ కుమార్‌ దర్శకుడు పిఎస్ మిత్రన్‌కు కారును బహుమతిగా ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కారు తాళాన్ని కార్తి చేతుల మీదుగా డైరెక్టర్‌కు అందించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇక దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా ప్రకటించింది చిత్రబృందం. దానికి సర్దార్‌2(Sardar 2) గా టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ‘సర్దార్‌’కి పని చేసిన బృందమే ఈ రెండో పార్ట్‌లోనూ భాగం కానుందని స్పష్టత ఇచ్చారు. ‘‘ఒక్కసారి గూఢచారి అయితే.. ఎప్పుడూ గూఢచారియే’’ అంటూ సర్దార్‌ కొడుకు పాత్ర రా ఏజెంట్‌గా ఎంపికవ్వడాన్ని ప్రచార చిత్రంలో చూపించారు. కార్తి సరసన రాశిఖన్నా నటించిన ఈ సినిమాలో చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా, మునిష్కాంత్, అశ్విన్ కీలకపాత్రలు పోషించారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని