NTR: బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్.. బీటౌన్ స్టార్హీరో ట్వీట్ వైరల్
ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం సినీ సెలబ్రిటీలు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.
ఇంటర్నెట్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా ‘వార్ 2’ (WAR 2) పేరుతో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ (NTR) నటించనున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడా వార్తలకు మరింత బలం అందించేలా హృతిక్‌రోషన్ శనివారం ఓ ట్వీట్ పెట్టారు. తారక్‌కు పుట్టినరోజున శుభాకాంక్షలు చెబుతూ తన కోసం యుద్ధభూమిలో ఎదురుచూస్తుంటానని పేర్కొన్నారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా!! ఈరోజు సంతోషంగా గడవాలని, ఈ ఏడాదంతా యాక్షన్ ప్యాక్డ్గా ఉండాలని కోరుకుంటున్నా. మై ఫ్రెండ్ నీకోసం యుద్ధభూమిలో ఎదురుచూస్తున్నా. నన్ను కలిసే వరకూ నీ రోజులన్నీ సంతోషం, ప్రశాంతంతో నిండాలని కోరుకుంటున్నా’’ అని హృతిక్ రాసుకొచ్చారు.
‘‘మీ లవ్లీ విషెస్‌కు ధన్యవాదాలు సార్..! మీరు కూడా రోజులు లెక్కబెట్టుకోండి. జరగనున్న దాని గురించి ఆలోచిస్తూ చక్కగా నిద్రపోతున్నారని అనుకుంటున్నా. ఎందుకంటే, మంచి విశ్రాంతితో యుద్ధభూమిలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నా. త్వరలో కలుద్దాం’’ అని తారక్ రిప్లై ఇచ్చారు.
కాగా, ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిని చూసిన నెటిజన్లు ‘వార్ 2’లో ఎన్టీఆర్ భాగం అవుతోన్న విషయం నిజమేనని అనుకుంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు పలువురు సినీ సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
‘‘అద్భుతమైన ప్రతిభ కలిగిన ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు, సంతోషం అందించాలని ప్రార్థిస్తున్నాను’’ - చిరంజీవి
‘‘నా ప్రియమైన సోదరుడు తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘దేవర’లో నీ క్రోధమైన లుక్ చూసి ఆశ్చర్యపోయాను. ఆనందం, ప్రేమ, చిరునవ్వులతో ఈ రోజు నిండాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని ఆశిస్తున్నా’’ - మనోజ్ మంచు
‘‘నేను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు నీకు ఉండాలని కోరుకుంటున్నాను. విజయం, సంతోషంతో ఈ ఏడాది అత్యద్భుతంగా కొనసాగాలని ప్రార్థిస్తున్నాను’’ - ఖుష్బూ
‘‘2003లో నేను ‘సింహాద్రి’ చూడలేకపోయాను. కానీ, (సింహాద్రి రీ రిలీజ్‌ను ఉద్దేశిస్తూ..) ఈ అనుభవం దానికి తగ్గట్టుగా ఉంది. ప్రతి పది నిమిషాలకు థియేటర్లో సందడి ఉంది. అభిమానులందరి నుండి అద్భుతమైన పుట్టినరోజు బహుమతి ఇది’’ - కార్తికేయ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే?