Venky75: వెంకటేష్ ‘‘సైంధవ్’’పై దర్శకుడు ఆసక్తికర కామెంట్స్
వెంకటేష్(Venkatesh) హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో ‘‘సైంధవ్’’(Saindhav) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం తన శాయశక్తులా శ్రమిస్తానని శైలేష్(Sailesh Kolanu) అన్నారు.
హైదరాబాద్: వెంకటేష్(Venkatesh) హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘‘సైంధవ్’’(Saindhav) గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా(#Venky75) పోస్టర్‌లు, గ్లింప్స్ సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ఖరారు చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
‘సైంధవ్’ సినిమా టీంకు అభినందనలు చెబుతూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దానికి శైలేష్ కొలను రిప్లై ఇచ్చారు. ‘‘ఇది ట్రిబ్యూట్ మాత్రమే కాదు. నేను వెంకటేష్ గారి కోసమే దర్శకుడిగా మారానని అనిపిస్తుంటుంది. ఆయన్ని ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా చూపించాలని ఆశిస్తున్నాను. వెంకటేష్, ఆయన అభిమానులు గర్వపడేలా శాయశక్తులా శ్రమించి ఈ సినిమా తీస్తా’’ అని అన్నారు. ఇక వెంకటేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Arvind Kejriwal: బాబోయ్ మీకో నమస్కారం.. అంతా మీ దయ వల్లే జరిగింది: భాజపాకు కేజ్రీవాల్ కౌంటర్
-
World News
Israel: ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు!
-
Politics News
Dharmapuri Srinivas: అర్వింద్ దిగజారి వ్యవహరిస్తున్నారు: ధర్మపురి సంజయ్
-
India News
Bilkis Bano: బిల్కిస్ బానో పిటిషన్.. భావోద్వేగాలతో తీర్పు ఇవ్వలేం: సుప్రీం
-
Sports News
Virat - Anushka: మా ఇద్దరిలో విరాట్ డ్యాన్స్ అదరగొడతాడు: అనుష్క
-
General News
TTD: తితిదేకి రూ.3 కోట్ల జరిమానా.. చెల్లించామన్న సుబ్బారెడ్డి