surender reddy: దర్శకుడు సురేందర్‌రెడ్డికి గాయం

surender reddy: సినీ దర్శకుడు సురేందర్‌రెడ్డి షూటింగ్‌ సమయంలో గాయపడ్డారు.

Published : 08 Jan 2023 01:42 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ దర్శకుడు సురేందర్‌రెడ్డి (Surender Reddy) గాయపడ్డారు. అక్కినేని అఖిల్‌ (Akhil) కథానాయకుడిగా ఆయన తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’ (Agent). ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ చిత్రీకరణలో భాగంగా సురేందర్‌రెడ్డి కాలికి గాయమైంది. షూటింగ్‌ సమయంలో ఒక ఇనుప చువ్వ బలంగా కాలికి తగలడంతో గాయమైనట్లు చిత్ర వర్గాలుచెబుతున్నాయి. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

కాలుకు కట్టుకట్టిన వైద్యులు కొంతకాలం విశ్రాంతి అవసరమని చెప్పారు. అయితే, ‘ఏజెంట్‌’ షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దృఢనిశ్చయంతో ఉన్న సురేందర్‌రెడ్డి కాలికి కట్టుతోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నారు. సాక్షి వైద్య (Sakshi Vaidya) ఇందులో కథానాయకురాలు కాగా, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు