Gangs Of Godavari: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌... వచ్చేది ఎప్పుడంటే?

విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. 

Updated : 16 Mar 2024 18:50 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. విశ్వక్‌ సేన్‌ ఇటీవల విడుదలైన ‘గామి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో అఘోరా పాత్రలో నటించి ప్రేక్షకులు, అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా విశ్వక్‌ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్‌,  నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’(Gangs Of Godavari). దర్శకుడు కృష్ణచైతన్య తెరకెక్కించారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. మే 17న సినిమా విడుదల చేస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. గంగమ్మతోడు సెప్తున్నా మే 17న థియేటర్‌ శివాలెత్తిపోద్దంతే అని విశ్వక్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఇప్పటివరకూ విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌, ‘సుట్టంలా సూసి’ పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.  అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తర్వాత రిలీజ్‌ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు