ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘జోహార్‌’ మోషన్‌ టీజర్‌!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త దర్శకుల హవా నడుస్తోంది. చిన్న ఎలిమెంట్‌ను తీసుకుని రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని కుర్చీలో కట్టిపడేస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజకీయ వ్యంగాస్త్ర చిత్రం ‘జోహార్‌’. ఈస్తర్‌ అనిల్‌, నైనా గంగూలీ...

Published : 04 Feb 2020 22:05 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త దర్శకుల హవా నడుస్తోంది. చిన్న ఎలిమెంట్‌ను తీసుకుని రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని కుర్చీలో కట్టిపడేస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజకీయ వ్యంగాస్త్ర చిత్రం ‘జోహార్‌’. ఈస్తర్‌ అనిల్‌, నైనా గంగూలీ, సుధాకర్‌, రోహిణి, ఈశ్వరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర పోస్టర్లు సినిమాపై ఆసక్తిగా పెంచగా, తాజాగా విడుదల చేసిన మోషన్‌టీజర్‌ ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

ప్రస్తుత రాజకీయ, సాంఘిక పరిణామాల్ని ఎత్తి చూపుతూ...  రాజకీయం కాళ్ల కింద నలిగిపోయిన ఐదు జీవితాల కథనాలే ఇతివృత్తంగా రూపొందించినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.  సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ దగ్గర పనిచేసిన తేజ మార్ని ఈ సినిమాను విభిన్నంగా తీర్చిదిద్దుతున్నారు. అభిషేక్‌ నామా పిక్చర్స్‌ పతాకంపై సందీప్‌ మార్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రియదర్శన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని