నాగ్‌ సినిమాపై కరోనా ఎఫెక్ట్‌!

రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా టాలీవుడ్ కథానాయకుడు నాగార్జున నటిస్తున్న ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా షూటింగ్‌ను రద్దు చేశారట. ‘మహర్షి’ సినిమాకు కథ....

Updated : 05 Feb 2020 21:46 IST

హైదరాబాద్‌: రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా టాలీవుడ్ కథానాయకుడు నాగార్జున నటిస్తున్న ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా షూటింగ్‌ను రద్దు చేశారట. ‘మహర్షి’ సినిమాకు కథ అందించిన అహిషోర్ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సాయామీ ఖేర్‌ కీలకపాత్రలో నటించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ త్వరలో థాయ్‌లాండ్‌లో ఓ కీలక షెడ్యూల్‌ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించాలని చిత్రబృందం నిర్ణయించుకుందట. అయితే కరోనా వైరస్‌ కారణంగా చిత్రబృందం థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌ను కొంతకాలంపాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని