నీవల్లే ప్రేమంటే ఏంటో తెలిసింది: బన్నీ

ఒకరి వల్ల తనకి ప్రేమంటే ఏమిటో తెలిసిందని టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అన్నారు. కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు అయాన్‌, అర్హ జన్మించిన విషయం విధితమే....

Updated : 04 Mar 2024 15:28 IST

సోషల్‌మీడియాలో అల్లుఅర్జున్‌ పోస్ట్‌...!

హైదరాబాద్‌: ఒకరి వల్ల తనకి ప్రేమంటే ఏమిటో తెలిసిందని టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అన్నారు. కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు అయాన్‌, అర్హ జన్మించిన విషయం విధితమే. అయితే శుక్రవారం అయాన్‌ 6వ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్‌ ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘ప్రేమంటే ఏమిటి?’ అనే విషయం గురించి నేను ఎప్పుడూ ఆలోచించేవాడిని. గతంలో నేను గొప్ప ఫీలింగ్స్‌ను చవిచూశాను.. ఆ ఫీల్సింగ్స్‌ ప్రేమో కాదో నాకు కచ్చితంగా తెలియదు. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నాకు ప్రేమంటే ఏమిటో తెలిసింది. నువ్వే ప్రేమ. ఐ లవ్‌ యూ అయాన్‌. హ్యాపీ బర్త్‌డే మై బేబీ’ అని బన్నీ పోస్ట్‌ పెట్టారు.

ఈ ఏడాది విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలో అల్లు అర్జున్‌ నటించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీ సరసన పూజాహెగ్డే సందడి చేశారు. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ లారీడ్రైవర్‌గా విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం రష్మిక-బన్నీ మొదటిసారి కలిసి పనిచేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని