Pawan kalyan: పవన్‌కల్యాణ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఆ సినిమా రీ-రిలీజ్‌

Pawan kalyan: పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ‘గుడుంబా శంకర్‌’ మూవీని రీ-రిలీజ్‌ చేయబోతున్నట్లు నిర్మాత నాగబాబు తెలిపారు.

Published : 09 Aug 2023 15:37 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు వరుస ట్రీట్‌లు రాబోతున్నాయి. ప్రస్తుతం పవన్‌ నటించే పలు సినిమాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్స్‌ ఇవ్వబోతున్నారు. అంతేకాదు, 2004లో పవన్‌ నటించిన ‘గుడుంబా శంకర్‌’ (Gudumba Shankar) చిత్రాన్ని రీ-రిలీజ్‌ చేయనున్నట్లు ఆయన సోదరుడు నాగబాబు తెలిపారు.

‘‘ఆగస్టు 31, సెప్టెంబర్ 1న.. ‘గుడుంబా శంకర్’ని థియేటర్లలో తిరిగి విడుదల చేస్తున్నాం. ‘జల్సా’, ‘ఆరెంజ్’ టిక్కెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని ఎలాగైతే జనసేన పార్టీకి  ఫండ్‌గా ఇచ్చామో, అలాగే ఈ చిత్రం ద్వారా  వచ్చిన మొత్తాన్ని  జనసేన పార్టీ ఫండ్‌కి అంకితం చేస్తాం. అధికారిక పోస్టర్ వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని నాగబాబు ట్వీట్‌ చేశారు.

‘జానీ’ పరాజయం తర్వాత పవన్‌కల్యాణ్‌ నటించిన యాక్షన్‌ కామెడీ మూవీ ఇది. వీర శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుడుంబా శంకర్‌’ను నాగబాబు నిర్మించారు. మీరా జాస్మిన్‌ కథానాయిక. కామెడీ పరంగా అభిమానులను అలరించినా, బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. మణిశర్మ అందించిన పాటలు మాత్రం శ్రోతలను అలరించాయి.

డీజే టిల్లు కూడా..

సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన రొమాంటిక్‌ క్రైమ్‌ డ్రామా ‘డీజే టిల్లు’. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీనికి కొనసాగింపుగా ‘టిల్లు స్క్వేర్‌’రాబోతోంది. ఈ క్రమంలో ‘డీజే టిల్లు’ మూవీని ఆగస్టు 18న రీ-రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబరు 6న ‘టిల్లు స్క్వేర్‌’ రానుంది.  అలాగే ప్రభాస్‌ నటించిన ‘యోగి’, ధనుష్‌ ‘రఘువరన్‌ బీటెక్‌’ చిత్రాలను కూడా ఆగస్టు 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని