Gurtunda Seetakalam: కోమలి, అమ్ము, దివ్య, నిధి.. వీళ్లలో నా జీవిత భాగస్వామి ఎవరో: సత్యదేవ్

పవర్‌ఫుల్‌ డైలాగ్‌ డెలవరీ, మాస్‌ యాక్షన్‌తో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు నటుడు సత్యదేవ్‌. ఇప్పటివరకూ పొలిటికల్‌ డ్రామా, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వంటి...

Published : 14 Feb 2022 12:25 IST

హృదయాన్ని హత్తుకునేలా ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్‌

హైదరాబాద్‌: పవర్‌ఫుల్‌ డైలాగ్‌ డెలవరీ, మాస్‌ యాక్షన్‌తో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు సత్యదేవ్‌. ఇప్పటివరకూ పొలిటికల్‌ డ్రామా, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వంటి కథా చిత్రాలతో అలరించిన ఆయన మొదటిసారి పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. అదే ‘గుర్తుందా శీతాకాలం’. ఫీల్‌గుడ్‌ మూవీగా సిద్ధమైన ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. లవర్‌బాయ్‌గా సత్యదేవ్‌ నటించగా.. ఆయన ప్రేయసి పాత్రల్లో తమన్నా, మేఘా ఆకాశ్‌, కావ్యశెట్టి సందడి చేశారు.

‘‘శీతాకాలం.. మంచులో మనసులు తడిసి ముద్దయ్యే కాలం. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం. నా లైఫ్‌లో శీతాకాలానికి మరో పేరు ఉంది.. అదే సీజన్‌ ఆఫ్‌ మేజిక్‌‌’’ అంటూ సత్యదేవ్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా సాగింది. సంభాషణలకు అనుగుణంగా కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. నాగశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి, నాగశేఖర్‌, రామారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని