OTT Movies: ఈ వారం ఓటీటీలో అలరించనున్న 15 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు

OTT Movies and web-series: ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి అవేంటో చూసేయండి.

Published : 29 Jun 2023 12:15 IST

నాలుగు కథలతో..

మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia), మృణాల్‌ ఠాకూర్‌, కాజోల్‌, విజయ్‌ వర్మ కీలక పాత్రల్లో నటించిన  కొత్త వెబ్‌సిరీస్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌2’ (Lust Stories 2). 2018లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన  ‘లస్ట్‌ స్టోరీస్‌’కు  కొనసాగింపుగా దీన్ని రూపొందించారు. జూన్‌ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది ప్రసారమవుతోంది. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ, కొంకణా సేన్‌ శర్మ, R.బాల్కి, సుజోయ్‌ ఘోష్‌లు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌ ప్రచార చిత్రాలు సిరీస్‌పై మంచి అంచనాలను తీసుకొచ్చాయి. ఇక తమన్నా, విజయ్‌ వర్మల ప్రచారం ఆసక్తిని పెంచింది. అంతేకాదు, తన కెరీర్‌లో తొలిసారి ఈ సిరీస్‌కోసం కిస్‌ సీన్‌లో నటించినట్లు తమన్నా చెప్పడం గమనార్హం.


మెరుపు వీరుడి కథ

సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ తమిళ ఆది కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వీరన్‌’ (Veeran). జూన్‌ 2న తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా జూన్‌ 30వ తేదీ నుంచి ‘వీరన్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్‌లో కేవలం తమిళ్‌లోనే విడుదల కాగా, ఓటీటీలో తమిళ్‌తో పాటు, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో రానుంది. 15ఏళ్ల బాలుడు మెరుపుదాడికి గురైన తర్వాత ఏం జరిగింది? అతడికి ఎలాంటి శక్తులు వచ్చాయి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


కార్పొరేట్‌ ఉద్యోగి కష్టాలు..

చిన్న ప‌ట్ట‌ణం నుంచి మ‌హా నగరానికి వచ్చి ఉద్యోగిగా జీవితం మొదలు పెట్టిన అరుణ్ కుమార్ అనే యువ‌కుడి క‌థ‌తో రూపొందించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘అర్థమైందా అరుణ్‌కుమార్‌’ (Arthamayyindha Arun Kumar). ‘ప్రతి ఒక ఇంటర్న్‌ కథ’ అనేది ఉప శీర్షిక. హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జొనాథన్‌ ఎడ్వర్డ్స్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. (Arthamayyindha Arun Kumar on aha) జూన్‌ 30వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి రానుంది.కార్పొరేట్ ప్ర‌పంచంలో ఇంట‌ర్న్‌గా ప్ర‌యాణం మొదలు పెట్టిన ఓ యువ‌కుడికి ఎలాంటి అనుభ‌వాలు ఎదురయ్యాయి? ప్రేమ‌, క‌ష్ట‌న‌ష్టాలతో పాటు ఏదో సాధించాల‌నుకునే ఆ యువ‌కుడు ఆ స‌వాళ్ల‌ను ఎదుర్కొని త‌న‌దైన స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడ‌నే విష‌యాలు తెలియాలంటే సిరీస్‌ చూడాలి.


ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌

  • జాక్‌ ర్యాన్‌ (వెబ్‌సిరీస్‌ 4) జూన్‌ 30

నెట్‌ఫ్లిక్స్‌

  • ది విచ్చర్‌ సీజన్‌-3 (ఇంగ్లీష్‌) జూన్29
  • ది ఇన్నర్‌ ఛాంబర్స్‌ (జపనీస్‌) జూన్‌ 29
  • సీయూ ఇన్‌మై నైన్టీన్త్‌ లైఫ్‌ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 29
  • అఫ్వా (హిందీ) జూన్‌30
  • సెలెబ్రిటీ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 30
  • ఈజ్‌ ఇట్‌ టేక్‌ సీజన్‌2 (ఇంగ్లీష్‌) జూన్‌ 30 

    డిస్నీ+హాట్‌స్టార్‌

  • వీకెండ్‌ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ది నైట్‌ మేనేజర్‌ (సిరీస్‌2) జూన్‌30


జీ5

  • లకడ్‌బగ్గా (హిందీ) జూన్‌ 30

బుక్‌ మై షో

  • ఫాస్ట్‌ ఎక్స్‌ (హాలీవుడ్‌) జూన్‌ 29

జియో సినిమా

  • సార్జెంట్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 30
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని