Vijay: సూపర్‌ స్టార్‌ కాంట్రవర్సీపై విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

విజయ్‌ తాజా చిత్రం ‘లియో’ (Leo) సక్సెస్‌మీట్‌ను చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఇందులో విజయ్ స్పీచ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

Updated : 02 Nov 2023 14:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay)-లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh KanagaRaj)కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘లియో’. ఈ సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. కొన్ని కారణాల వల్ల దీని ఆడియో రిలీజ్‌ను కూడా క్యాన్సిల్ చేశారు. తాజాగా ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ను చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఇందులో విజయ్ ‘లియో’ విషయంలో ఎదురైన విమర్శల నుంచి ఇటీవల వైరల్‌గా మారిన సూపర్‌ స్టార్‌ కాంట్రవర్సీ వరకు అన్నింటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘లియో’ (Leo) నుంచి విడుదలైన తొలిపాట ‘నా రెడీ..’ విషయంలో పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్‌, పాట లిరిక్స్‌ అన్ని మార్చాలంటూ కొందరు విమర్శించారు. దీంతో మూవీ టీమ్ వాటిలో మార్పులు చేసింది. దీనిపై మాట్లాడిన విజయ్‌.. ‘‘ఆ పాట లిరిక్స్‌లో ‘చేతి వేళ్ల మధ్యలో టార్చ్‌..’ అనే లైన్‌ ఉంటుంది. దానిని సిగరెట్‌ అనే ఎందుకు అనుకోవాలి. ఓ పెన్ను అని కూడా అనుకోవచ్చు కదా? ఇలా నేను జవాబివ్వవాలనుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ, నేను అన్నింటి గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఓ సినిమాను సినిమాలానే చూడాలని అందరినీ కోరుతున్నా. అది కేవలం వినోదం కోసం మాత్రమే. మంచి-చెడు రెండూ ఉంటాయి. మంచిని మాత్రమే తీసుకోవాలి’’అన్నారు.

 ‘తంగలాన్‌’లో నాకు డైలాగులు లేవు.. అసలు విషయం చెప్పేసిన విక్రమ్‌

అలాగే సూపర్‌ స్టార్‌ కాంట్రవర్సీ గురించి స్పందిస్తూ.. ‘తమిళంలో ఒక్కరే తలైవర్‌ ఆయన ఎంజీ రామచంద్రన్‌, ఒక్కరే నడిగర్‌ తిలగం ఆయనే శివాజీ గణేశన్‌, ఒక్కరే సూపర్‌ స్టార్‌ ఆయనే రజనీకాంత్‌ (Rajinikanth). ఒక్కరే ఉలగనాయగన్‌ తనే కమల్‌ హాసన్‌, ఒక్కరే తాలా అతనే అజిత్. ఇక నేను దళపతిని. దళపతి అంటే రాజు ఆదేశాన్ని పాటించే వాడు అని అర్థం. అభిమానులంతా నా రాజులు. నేను మీ సేవకుడిని’ అని అన్నారు.

ఇక అభిమానులనుద్దేశిస్తూ.. ‘‘ నాకోసం ప్రాణమిచ్చే అభిమానులున్నారు. మీప్రేమను ఎలా తిరిగివ్వాలో నాకు తెలియడం లేదు. మీరంతా నా గుండెల్లో ఉన్నారు. నా దృష్టిలో మీ అందరి హృదయాలు దేవాలయాలు. ఏమీ ఆశించకుండా మీరు చూపించే ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అంటూ తనను అభిమానించే వారికి కృతజ్ఞతలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని