Kannappa: ‘కన్నప్ప’ కోసం హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌

‘కన్నప్ప’ టీమ్‌లో (Kannappa) హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌ జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్ ట్వీట్‌ చేసింది.

Published : 04 Nov 2023 13:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఇందులోని నటీనటులను ప్రకటించిన చిత్రబృందం.. తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది.

ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోహీరోయిన్స్‌ ఇందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హాలీవుడ్‌ స్టంట్ మాస్టర్‌ కీచా ఖామ్‌ఫక్డీ ఇందులో భాగమైనట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. ‘ఇంతకు ముందెప్పుడూ చూడని సినిమాటిక్‌ అనుభవాన్ని ‘కన్నప్ప’ అందించనుంది. దాని కోసం సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది. ఈ సినిమాలో స్టంట్స్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంటాయని చిత్రబృందం తెలిపింది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌ కూడా ఈ చిత్రలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్ (Prabhas) శివుడిగా, నయనతార (Nayanthara) పార్వతిగా కనిపించనున్నట్లు పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇందులో హీరోయిన్‌గా మొదట నుపుర్‌ సనన్‌ను ఎంపిక చేశారు. డేట్స్‌ సర్దుబాటు చేయడంలో సమస్యలు తలెత్తడంతే ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగారు.

అందుకే హీరోయిన్ అవకాశాలు కోల్పోయాను: అనసూయ

ఇక ఈ సినిమా మొత్తం ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నారు. న్యూజిలాండ్‌లో దీని చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికోసం 800 మంది సిబ్బందితో 5 నెలల పాటు ఆర్ట్‌ వర్క్‌ను సిద్ధం చేయించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో హీరో మంచు విష్ణు గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై మోహన్‌బాబు ట్వీట్‌ చేస్తూ విష్ణు కోలుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే షూటింగ్‌లో జాయిన్‌ అవుతారన్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రానుంది. ప్రముఖ నటుడు మోహన్‌ బాబు (Mohan Babu) దీన్ని నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని