Indrani Mukerjea: ఇంద్రాణీ ముఖర్జీ డాక్యుమెంటరీ విడుదలకు లైన్‌ క్లియర్‌!

‘ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: ది బర్రీడ్‌ ట్రూత్‌’ స్ట్రీమింగ్‌ ఆపాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టేసింది.

Published : 29 Feb 2024 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఒక డాక్యుమెంటరీ సిరీస్‌ని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ‘ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: ది బర్రీడ్‌ ట్రూత్‌’ పేరుతో ఇది రూపొందింది. ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు లైన్‌ క్లియరైంది. దీని విడుదలను ఆపాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తాజాగా కొట్టేసింది.

మొదట ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్‌ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ భావించింది. అయితే, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ  సీబీఐ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన డివిజన్‌ బెంచ్‌.. దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను ఆదేశించింది. దీనికి నెట్‌ఫ్లిక్స్‌ అంగీకరించింది. విచారణ పూర్తయ్యేవరకు ప్రసారం చేయబోమని న్యాయస్థానానికి తెలిపింది. తాజాగా దీనిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో దీని విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.

నన్ను క్షమించండి.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా: నాగబాబు

2012లో తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టై సుమారు ఆరున్నరేళ్లపాటు జైల్లో ఉన్న ఇంద్రాణీ.. 2022 మేలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ వ్యవహారంపై నెట్‌ఫ్లిక్స్‌ ‘ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: ది బర్రీడ్‌ ట్రూత్‌’ డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని