Guntur kaaram: ‘గుంటూరు కారం’ విషయంలో అందుకే గందరగోళం ఏర్పడింది: జగపతి బాబు

‘గుంటూరు కారం’ సినిమాను తాను ఎంజాయ్‌ చేయలేకపోయినట్లు జగపతిబాబు చెప్పారు.

Published : 09 Apr 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’(Guntur Kaaram). ఇందులో నటుడు జగపతిబాబు (Jagapathi Babu) విలన్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆ సినిమాను ఎంజాయ్‌ చేయలేకపోయినట్లు తెలిపారు.

‘‘మహేశ్‌బాబుతో కలిసి పనిచేయడం నాకు ఎప్పుడూ ఇష్టమే. కానీ, నిజం చెప్పాలంటే ‘గుంటూరు కారం’ను ఎంజాయ్‌ చేయలేకపోయా. అందులో కొన్ని పాత్రల్లో మార్పులు చేస్తే బాగుండేది. క్యారెక్టరైజేషన్‌ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడింది. దీంతో సినిమాను ముగించడం కొంచెం కష్టమైంది. నా పాత్ర కోసం నేను చేయాల్సిందంతా చేశాను. మహేశ్‌తో చేసిన మూవీ ఎప్పటికీ గుర్తుండిపోవాలనుకుంటా. ఆయన చిత్రాల్లో ఏ అవకాశాన్నీ వదులుకోను. ‘శ్రీమంతుడు’ నాకు అద్భుతమైన అనుభవాన్ని అందించింది’ అని చెప్పారు. ఇక తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘నేను కొన్ని అనవసరమైన చిత్రాలు చేశాను. కథను ఎంచుకోవడంలో పొరపడ్డాను. నాకు కమర్షియల్‌ మైండ్‌ లేదు. ఈతరహా కథలే చేయాలని హద్దులు పెట్టుకోలేదు. ఏ సినిమా నచ్చితే అది చేశాను. ఒకవేళ అలా చేయకపోయి ఉంటే ఇంకా మంచి స్థానంలో ఉండేవాడినేమో. అయినా నేనేం బాధపడడం లేదు’ అన్నారు.

విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగపతిబాబు ఇటీవల ‘సలార్‌’, ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ప్రస్తుతం ‘పుష్ప2’లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఈ చిత్రం రానుంది. దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 15న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని