Keedaa Cola: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కీడా కోలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

తరుణ్ భాస్కర్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కీడా కోలా’ (Keedaa Cola). ఈ వినోదాత్మక చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Published : 19 Dec 2023 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తరుణ్‌ భాస్కర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కీడా కోలా’ (Keedaa Cola). గత నెలలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. ఇప్పుడీ క్రైమ్ కామెడీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. డిసెంబర్‌ 29 నుంచి ఆహా వేదికగా ప్రసారం కానుంది. ఆహా గోల్డ్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఓరోజు ముందుగా డిసెంబర్‌ 28నుంచి అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ తెలిపింది. రానా సమర్పణలో వచ్చిన ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, చైతన్య రావు మదాడి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఆయన లేకపోతే ‘సలార్‌’ లేదు..: ప్రశాంత్ నీల్‌

క‌థేంటంటే: వాస్తు (చైత‌న్య‌రావు), అత‌ని తాత వ‌ర‌ద‌రాజు (బ్ర‌హ్మానందం), లాయ‌ర్ అయిన కౌశిక్ (రాగ్ మ‌యూర్‌) వీళ్లంద‌రి ధ్యేయం డ‌బ్బు సంపాదించడ‌మే. తాత కోసం కొన్న శీత‌ల పానీయం కీడా కోలా బాటిల్‌లో బొద్దింక‌ని చూపించి య‌జ‌మానిని బ్లాక్‌మెయిల్ చేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతారు. రూ.5 కోట్ల నుంచి బేర‌సారాలు మొద‌ల‌వుతాయి. మ‌రోవైపు జీవ‌న్ (జీవ‌న్‌)కి కార్పొరేట‌ర్ కావాల‌నేది ఆశ‌. 20 ఏళ్లు జైల్లో ఉండి బ‌య‌టికి వ‌చ్చిన త‌న అన్న నాయుడు (Tarun bhaskar) అండ‌తో ఆ ప్ర‌య‌త్నాల్లోకి దిగుతాడు. జీవ‌న్ కార్పొరేట‌ర్ కావాల‌న్నా కూడా డ‌బ్బే అవ‌స‌రం కావ‌డంతో అందుకోసం వీళ్లు కూడా ఓ వ్యూహం ప‌న్నుతారు. మ‌రి వీళ్లంద‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? డ‌బ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్‌, జీవ‌న్ గ్యాంగ్ ఎలా క‌లిశారు? ఇంత‌కీ కోలాలో బొద్దింక ఎలా ప‌డింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని