KGF Chapter 2: ఆ రికార్డు సాధించిన తొలి చిత్రం కేజీయఫ్‌: చాప్టర్‌-2

ఈ ఏడాది థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రాల్లో ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’ (KGF Chapter 2) ఒకటి. యశ్‌ (Yash) కథానాయకుడిగా

Updated : 16 Jul 2022 12:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రాల్లో ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’ (KGF Chapter 2) ఒకటి. యశ్‌ (Yash) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అనంతరం అమెజాన్‌ప్రైమ్‌ వేదికగానూ రికార్డులు నమోదు చేసింది. సినిమాలకు సంబంధించి బాక్సాఫీస్‌ విశ్లేషణలు, రేటింగ్స్‌ ఇచ్చే ఓర్‌మ్యాక్స్‌ పవర్‌ రేటింగ్స్‌లో 90+ స్కోరు సాధించిన తొలి చిత్రంగా ఇప్పుడు ‘కేజీయఫ్‌2’ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి ఓర్‌మ్యాక్స్‌పవర్‌ రేటింగ్స్‌లో ఈ ఘనత సాధించటం విశేషం. అంతేకాదు, 2022 తొలి అర్ధభాగంలో విడుదలైన సినిమాలల్లో  8.5 ఐఎండీబీ రేటింగ్స్‌తోనూ ‘కేజీయఫ్‌2’ అదరగొట్టింది.

ఇక కలెక్షన్ల పరంగా కేజీయఫ్‌2 కేవలం ఒక్క హిందీలోనే రూ.430కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు యశ్‌ తర్వాత చేయబోయే సినిమాపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కాగా, దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ మాత్రం ప్రభాస్‌తో ‘సలార్‌’ శరవేగంగా షూటింగ్‌ చేస్తున్నారు. ఇందులో యశ్‌ అతిథి పాత్రలో మెరుస్తారని కన్నడ చిత్ర వర్గాల టాక్‌. అది ఎలా? ఏ పాత్రలో కనిపిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయట. అయితే, చిత్ర బృందం మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు. మరోవైపు ‘సలార్‌’ రెండు భాగాలుగానూ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని