Lokesh Kanagaraj: ‘లియో’ సక్సెస్‌ మీట్‌.. లోకేశ్‌ కనగరాజ్‌ ఏమన్నారంటే..?

‘జపాన్‌’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj). ‘లియో’ (LEO) ఫలితం గురించి మాట్లాడారు

Updated : 29 Oct 2023 13:07 IST

చెన్నై: లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన రీసెంట్‌ మూవీ ‘లియో’ (LEO). ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా లోకేశ్‌ స్పందించారు.

‘‘లియో’ సక్సెస్‌ విషయంలో విజయ్‌ ఎంతో ఆనందంగా ఉన్నారు. కేరళలో ఓ థియేటర్‌కు వెళ్లినప్పుడు తోపులాటలో నాకు చిన్న గాయమైంది. విషయం తెలిసి విజయ్‌ ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. వాటన్నింటికీ బదులివ్వడానికి త్వరలోనే మీడియా ముందుకు రావాలనుకుంటున్నా. అలాగే, సెకండాఫ్‌ నిడివి ఎక్కువగా ఉందని పలువురు కామెంట్‌ చేస్తున్నారు. వాళ్ల అభిప్రాయాలను నేను స్వీకరిస్తున్నా. సక్సెస్‌ మీట్ పెట్టాలనే ఆలోచనలో మేం ఉన్నాం. చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అప్‌డేట్‌ ఇస్తాం’’ అని లోకేశ్ కనగరాజ్‌ తెలిపారు.

Vishwak Sen: తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారు.. : విశ్వక్‌సేన్‌ వైరల్‌ పోస్ట్‌

‘లియో’ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ జరగలేదు. కేవలం ఇంటర్వ్యూలతోనే దర్శకుడు లోకేశ్‌ దీనిని ప్రమోట్‌ చేశారు. ఆడియో ఈవెంట్‌ కోసం ప్లాన్‌ చేసినప్పటికీ అనుమతులు రాకపోవడంతో అది కూడా రద్దైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్‌ అభిమానులందరూ ‘లియో’ సక్సెస్‌ ఈవెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని