Lokesh Kanagaraj: తర్వాత చిత్రం గురించి ఆసక్తికర విషయం పంచుకున్న లోకేశ్ కనగరాజ్‌

తాజాగా ‘లియో’తో (Leo) ప్రేక్షకులను పలకరించిన లోకేశ్‌ కనగరాజ్‌ తన తర్వాత సినిమాను రజనీకాంత్‌తో తీయనున్నారు. దీనికి సంబంధించిన ఓఆసక్తికర విషయాన్ని ఆయన పంచుకున్నారు.

Updated : 31 Oct 2023 15:10 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఇండస్ట్రీలోని స్టార్‌ డైరెక్టర్లలో లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh kanagaraj) ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ‘లియో’తో (Leo) విజయాన్ని అందుకున్న ఆయన తన తర్వాత ప్రాజెక్ట్‌ను (Thalaivar 171) రజనీకాంత్‌తో చేయనున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దాని గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ఆరు నెలలపాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపిన లోకేశ్‌ కనగరాజ్‌.. రజనీకాంత్‌తో (Rajinikanth) తీయనున్న సినిమాకు పూర్తి సమయం కేటాయించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలు పెట్టినట్లు చెప్పారు. అలాగే ‘లియో’ సినిమాకు కొందరు కావాలనే నెగెటివ్‌గా రివ్యూలు ఇచ్చారన్నారు. ‘‘జర్నలిస్ట్‌లకు నేను కృతజ్ఞలు చెప్పాలి. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రేక్షకులతో పాటు వాళ్లూ ప్రధాన కారణం. అలాగే కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ వాళ్లు కావాలని ‘లియో’ బాగోలేదని ప్రచారం చేశారు. కొన్ని రోజుల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటా. ఇకపై నా దృష్టి అంతా ‘తలైవా171’ మీదే. ఈ సినిమాకు రజనీకాంత్‌ నెగెటివ్ షేడ్‌ హైలైట్‌ కానుంది’’ అని చెప్పారు. దీని షూటింగ్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభంకానుంది. అలాగే షూటింగ్‌ అంతా పూర్తయ్యే వరకు దీని విడుదల తేదీని ప్రకటించ కూడదని ఆయన భావిస్తున్నారు.

మెగా 156 ప్రాజెక్ట్‌ కోసం ఐదుగురు హీరోయిన్లు..!

ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ సినిమా టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో చేస్తున్నారు. భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సెట్స్‌లో అమితాబ్‌ జాయిన్‌ అయ్యారు. అలాగే ఇందులో మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌లు కథానాయికలు. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తవ్వగానే లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా మొదలుకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని