Maa Oori Polimera 2: ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో అలరిస్తున్న ‘మా ఊరి పొలిమేర2’

Maa Oori Polimera 2 ott: అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో సత్యం రాజేశ్‌ నటించిన ‘మా ఊరి పొలిమేర2’ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Updated : 12 Dec 2023 19:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సత్యం రాజేశ్‌, కామాక్షి భాస్కరాల, గెటప్‌ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మా ఊరి పొలిమేర-2’ (Maa Oori Polimera 2). నవంబరు 3న థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఓటీటీలో విడుదలైన ‘మా ఊరి పొలిమేర’కు మించి ట్విస్ట్‌లతో అనిల్‌ విశ్వనాథ్ దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం నటుడు సత్యం రాజేశ్‌ మరో మెట్టు ఎక్కారు. తాజాగా ఈ మూవీ ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం రికార్డు వ్యూస్‌తో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇప్పటివరకూ ఈ మూవీని ఆహాలో 100 మిలియన్‌ + వ్యూయింగ్‌ మినిట్స్‌ వీక్షణలను సొంతం చేసుకుని, రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్‌ను పంచుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని