Mahesh Babu: ‘ప్రేమలు’పై మహేశ్‌ బాబు రివ్యూ.. అద్భుతమంటూ ప్రశంసలు

తాజా హిట్ చిత్రం ‘ప్రేమలు’పై మహేశ్‌ బాబు (Mahesh Babu) ప్రశంసలు కురిపించారు.

Published : 13 Mar 2024 11:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళంలో సూపర్‌ హిట్ అయిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ప్రేమలు’ (Premalu) అదే పేరుతో తెలుగులో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీనిపై ఇప్పటికే ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా స్టార్‌ హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu) ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా చిత్రబృందంపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘ప్రేమలు మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినందుకు కార్తికేయకు కృతజ్ఞతలు. బాగా ఎంజాయ్‌ చేశాను. సినిమా చూస్తూ ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదు. మా కుటుంబం మొత్తానికి సినిమా బాగా నచ్చింది. యంగ్‌స్టర్స్‌ అందరూ అద్భుతంగా నటించారు. మొత్తం టీమ్‌కు నా అభినందనలు’ అని పోస్ట్‌ పెట్టారు.

రాజమౌళి మూవీలో మహేశ్‌ డ్యూయల్‌ రోల్‌.. నిజమేనా?

తాజాగా ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. రాజమౌళి ప్రత్యేక అతిథిగా విచ్చేసి టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రేమలు చూసేందుకు థియేటర్‌కు వెళ్లా. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నా. ఇది థియేటర్లలోనే చూడాల్సిన చిత్రం. నవ్వుల క్రెడిట్‌ రైటర్‌ ఆదిత్య హాసన్‌దే. మలయాళంలో ఎలాంటి సంభాషణలున్నాయో నాకు తెలియదుగానీ తెలుగు వెర్షన్‌లో ఆదిత్య అద్భుతంగా రాశాడు. మలయాళీ నటులంతా చక్కగా నటిస్తారు. గిరిజ (గీతాంజలి ఫేమ్), సాయి పల్లవిలా ఈ సినిమా హీరోయిన్‌ మమిత ప్రత్యేకంగా నిలుస్తుంది’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని