Kannappa: ‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది?.. విష్ణు సమాధానమిదే

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఇందులో ప్రభాస్‌ పాత్రపై ఆయన కామెంట్ చేశారు.

Published : 16 Jan 2024 02:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ (Prabhas) నటిస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో నటి మధుబాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ‘కన్నప్ప’లో ప్రభాస్‌ పాత్ర ఎలా ఉంటుందో మంచు విష్ణు కామెంట్స్‌ చేశారు.

‘‘కన్నప్ప’ షూటింగ్‌ 60శాతం పూర్తయింది. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారంటూ ఉత్తరాది ప్రేక్షకులు కూడా అడుగుతున్నారు. ఈ ఏడాది చివర్లో ‘కన్నప్ప’ను మీ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే దీని గ్లింప్స్‌ను విడుదల చేస్తాం. ఇందులో ప్రభాస్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్‌ ఉండదు. సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తాను. మరో నెలలో న్యూజిలాండ్‌ వెళ్లాలి. మిగిలిన చిత్రీకరణ కూడా అక్కడే చేస్తాం. ఇందులో మోహన్‌ బాబు, నా కుమారుడు అవ్రామ్‌ కూడా నటిస్తున్నారు’’ అని చెప్పారు.

అయోధ్య రామ మందిరానికి దగ్గర్లో స్థలం కొన్న అమితాబ్‌!

ఈ సినిమాతో ప్రీతి ముకుందన్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌, కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్‌ (Shiva Rajkumar)లు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాను మోహన్‌ బాబు (Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌లో ఒక షెడ్యూల్‌ పూర్తిచేసుకుని చిత్రబృందమంతా భారత్‌కు వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని