Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ

తన భర్త విద్యాసాగర్‌ మరణంపై వస్తోన్న అసత్య ప్రచారాలపై నటి మీనా స్పందించారు. ఇకపై అలాంటి వాటిని నిలిపివేయండంటూ సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగంతో కూడిన లేఖను పోస్ట్‌ చేశారు.

Updated : 01 Jul 2022 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన భర్త విద్యాసాగర్‌ (Vidya Sagar) మరణంపై వస్తోన్న అసత్య ప్రచారాలపై నటి మీనా (Meena) స్పందించారు. ఇకపై అలాంటి వాటిని నిలిపివేయండంటూ సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగంతో కూడిన లేఖను పోస్ట్‌ చేశారు. ‘‘భర్త దూరమయ్యారనే బాధలో నేనున్నా. దయచేసి మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. పరిస్థితి అర్థం చేసుకోండి. నా భర్త మరణం గురించి దయచేసి ఎలాంటి అసత్య ప్రచారాలు ప్రసారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్టకాలంలో మాకు సహాయం చేసినవారు, మా కుటుంబానికి తోడుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా భర్త ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించిన వైద్య బృందం, తమిళనాడు ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్‌ రాధాకృష్ణన్‌, మా స్నేహితులు, మీడియాకు ధన్యవాదాలు. నా భర్త త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేశారు. వారి ప్రేమకు ధన్యురాలుని’’ అని మీనా ఆ లేఖలో ఎమోషనల్‌గా రాశారు.

శ్వాసకోశ సమస్యతో విద్యాసాగర్‌ జూన్‌ 29న చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. ‘మీనా వాళ్లింటికి అతి చేరువలో పావురాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని, వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని’ అంటూ తమిళ, ఆంగ్ల మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. విద్యాసాగర్‌కు ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా ఎంత ప్రయత్నించినా దాతలు దొరకలేదని ఇటీవల మీనా స్నేహితురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కళా మాస్టర్‌ తెలిపారు. అంతకుముందు విద్యాసాగర్‌ కొవిడ్‌ కారణంగానూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు