Kannappa: ‘కన్నప్ప’ కోసం 600మంది హాలీవుడ్‌ ప్రముఖులు వర్క్‌ చేశారు: మోహన్‌ బాబు

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఈ సినిమా అప్‌డేట్‌ను మోహన్‌బాబు షేర్‌ చేశారు.

Published : 23 Dec 2023 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ చిత్రంపై మోహన్‌ బాబు తాజా అప్‌డేట్‌ ఇచ్చారు. ‘‘కన్నప్ప’ కోసం 600మంది హాలీవుడ్‌ ప్రముఖులు వర్క్‌ చేశారు. ఇందులో భారతదేశంలోని ఎంతోమంది అగ్రనటీనటులు నటిస్తున్నారు. 90రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో థాయిలాండ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు భాగమయ్యారు. న్యూజిలాండ్‌లోని ఎంతో అద్భుతమైన లోకేషన్లలో తొలి షెడ్యూల్‌ పూర్తయింది. దేవుడి దయ వల్ల అనుకున్న విధంగా దిగ్విజయంగా దీన్ని పూర్తిచేసి భారత్‌కు వస్తున్నాం’’ అంటూ లోకేషన్లో దిగిన ఫొటోను మోహన్‌ బాబు (Mohan Babu) షేర్‌ చేశారు. ఇక ఈ పోస్ట్‌కు ‘కన్నప్ప’ చిత్రబృందంతో పాటు ప్రభాస్‌ హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించారు.

‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. మంచు విష్ణు ఇందులో భక్తకన్నప్పగా కనిపించనున్నారు. ప్రముఖ మోడల్ ప్రీతి ముకుందన్‌ ఈ సినిమాతో నటిగా తెరంగేట్రం చేయనున్నారు. అలాగే, శివ పార్వతులుగా ప్రభాస్‌, నయనతార నటించనున్నట్లు నటి మధుబాల తెలిపారు. స్టార్‌ హీరోలు శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, మోహన్‌ బాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ ఆకట్టుకుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాను మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని