Mrunal: ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నాను..: మృణాల్ ఠాకూర్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవుతున్నందుకు ఆనందంగా ఉందని మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలిపింది. ఆ వేడుకలో పెద్ద దర్శకనిర్మాతలతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి నుంచి ఫ్రాన్స్‌లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) కన్నుల పండువగా జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు దీనికి హాజరుకానున్నారు. మన దేశం నుంచి కూడా కొందరు సినీ తారలు రెడ్ కార్పెట్‌పై హొయలొలికించనున్నారు. ఈ వేడుకకు ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తొలిసారి హాజరుకానుంది. దీనిపై ఆమె స్పందిస్తూ మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని తెలిపింది.
‘ప్రతిష్ఠాత్మకమైన ఈ వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను మొదటిసారి ఆ వేదికపై అడుగుపెట్టనున్నాను. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న దర్శకనిర్మాతలతో మాట్లాడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. కొత్త అవకాశాల కోసం, నా ప్రతిభను నిరూపించుకోవడానికి ఆసక్తిగా ఉన్నాను’ అని చెప్పింది. ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే ‘గుమరాహ్’ (Gumraah) చిత్రంలో పోలీస్‌గా అలరించిన మృణాల్ బాలీవుడ్‌లోనూ వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఇటు తెలుగులో కూడా నాని (nani) సరసన నటిస్తోంది. తాజాగా దీని గురించి మాట్లాడిన మృణాల్.. తన జీవితంలో ఇంత మంచి స్క్రిప్ట్‌ను చదవలేదని చెప్పింది. ఇలాంటి సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. #nani30గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సౌరవ్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: తిరుమల ఘాట్రోడ్లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు: ఈవో
-
India News
Elon Musk: మస్క్ తనయుడికి సందేహం.. దిల్లీ పోలీసుల రిప్లయ్!
-
India News
Wrestlers protest: బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే.. లేదంటే..: రాకేశ్ టికాయత్ హెచ్చరిక
-
General News
Viveka Murder case: సునీత పిటిషన్‌పై విచారణ ఈనెల 5కి వాయిదా
-
General News
Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్