Samantha: నాగచైతన్యతో ఉన్న ఆ ఇంటిని మళ్లీ కొన్న సమంత

టాలీవుడ్‌ లవ్లీ కపుల్‌గా పేరుతెచ్చుకున్న సమంత (Samantha)-నాగచైతన్య(Naga Chaitanya) విడిపోవడం నిజంగా దురదృష్టకరమని సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ (Murali Mohan) అన్నారు....

Updated : 29 Jul 2022 13:44 IST

దాని కోసం ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టింది : మురళీ మోహన్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ లవ్లీ కపుల్‌గా పేరుతెచ్చుకున్న సమంత (Samantha)-నాగచైతన్య(Naga Chaitanya) విడిపోవడం నిజంగా దురదృష్టకరమని సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ (Murali Mohan) అన్నారు. తమ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంటిని చైతన్య ఇష్టపడి కొనుగోలు చేశాడని.. పెళ్లైన వెంటనే సమంతతో కలిసి అక్కడే ఉన్నాడని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఆయన తెలిపారు. విడాకుల అనంతరం వాళ్లిద్దరూ ఆ ఇల్లు ఖాళీ చేసేసి వెళ్లిపోయారని.. కానీ, ఇటీవల సామ్‌ మళ్లీ అదే ఇంటిని ఎక్కువ డబ్బు చెల్లించి మరీ కొనుగోలు చేసిందని ఆయన వివరించారు.

‘‘మా అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంటిని చైతన్య ఇష్టపడి కొనుగోలు చేశాడని గతంలోనూ చెప్పాను. పెళ్లైన నాటి నుంచి విడిపోయేవరకూ వీళ్లిద్దరూ అక్కడే ఉన్నారు. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా కనిపించేవాళ్లు. అక్కడ ఉన్న రోజుల్లోనే చైతన్య మరొక ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటి రీమోడలింగ్‌ పనులు పూర్తైన వెంటనే వీళ్లిద్దరూ అక్కడికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో మా అపార్ట్‌మెంట్‌లోని ఇంటిని వేరే వాళ్లకు అమ్మేసి.. కొత్త ఇంటి రీమోడలింగ్‌ పనులు పూర్తైన వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో చై-సామ్‌ విడిపోయారు. విడిపోయిన రోజు చైతన్య.. తన సామానంతా తీసుకుని వెళ్లిపోయాడు. సామ్‌ కూడా కొన్నిరోజుల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత మరో ఇంటి కోసం సామ్‌ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో వెతికింది. మళ్లీ తిరిగి నా వద్దకే వచ్చింది. ‘‘నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది. ఇలాంటి అందమైన, ప్రశాంతమైన ఇల్లు మళ్లీ నాకు దొరకడం లేదు. ఈ ఇల్లు మళ్లీ నేను తీసుకోవచ్చా?’’ అని అడిగింది. దాంతో నేను, ఆ ఇంటిని ఎవరికైతే అమ్మారో వాళ్లతో మాట్లాడాను. అలా, సామ్‌ ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ ఆ ఇంటిని మళ్లీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం సామ్‌, వాళ్లమ్మ అక్కడే ఉంటున్నారు’’ అని మురళీమోహన్‌ చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని