Oscar 2023: చరిత్ర సృష్టించిన ‘RRR’.. ‘నాటు నాటు’కు ఆస్కార్..!
Oscar 2023: భారతీయ సినీ ప్రేమికులకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) తీసుకొచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు...’ సాంగ్ (Naatu Naatu Song )అవార్డును సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన పర్వం.. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ అవార్డు (oscars awards 2023)ను ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు...’ (Naatu Naatu Song) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. లాస్ ఏంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన ‘అప్లాజ్’ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), ‘లిఫ్ట్ మి అప్’ (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘హోల్డ్ మై హ్యాండ్’ (టాప్‌గన్ మావెరిక్) పాటలను వెనక్కి నెట్టి ‘నాటు నాటు..’(RRR)కు ఆస్కార్ దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ ప్రకటించగానే డాల్బీ థియేటర్ కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఆస్కార్ అవార్డును అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆనందోత్సాహల్లో మునిగిపోయింది. అంతకుముందు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్ ప్రదర్శనతో డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది.
చరిత్ర సృష్టించిన ‘నాటు నాటు’
ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకులుగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబ్టటింది. అంతేకాదు, గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమాపై.. హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభను ఎంతో మెచ్చుకున్నారు. ఇక భాషతో సంబంధం లేకుండా ‘నాటు నాటు...’ పాట ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ ఉత్సాహంతోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ వివిధ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులకు పోటీ పడగా, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు...’కు ఆస్కార్ నామినేషన్స్ తుది జాబితాలో చోటు దక్కించుకుంది. స్వరమణి కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట విడుదలైన నాటి నుంచే అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుని ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమకు ఆస్కార్ అవార్డును అందించింది. అంతేకాదు, ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చరిత్ర సృష్టించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ఐపీఎల్లో ‘ఇంపాక్ట్’ ఎవరికి కలిసొచ్చిందంటే?
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. నా తుది జట్టులో జడ్డూ ఉండడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
-
Politics News
Rahul Gandhi: ఇలాంటివి సాధ్యమని నేను ఊహించలేదు: రాహుల్ గాంధీ
-
Movies News
Siddharth: నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని.. ‘ఇండియన్2’ పై సూపర్ న్యూస్ చెప్పిన సిద్దార్థ్
-
India News
Uttarakhand: కొండచరియల బీభత్సం.. చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు
-
Politics News
YSRCP: కర్రసాము చేస్తూ కిందపడిన వైకాపా ఎమ్మెల్యే