Naga Chaitanya: శ్రీకాకుళంలో నాగచైతన్య.. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ కోసం సన్నాహాలు

‘కస్టడీ’ తర్వాత నాగచైతన్య (Naga Chaitanya) కొత్త ప్రాజెక్ట్‌ను ఓకే చేశారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది.

Updated : 03 Aug 2023 14:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు నాగచైతన్య (Naga Chaitanya) తన తదుపరి ప్రాజెక్ట్‌ పనుల్లో బిజీ అయ్యారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమా పనుల్లో భాగంగా నాగచైతన్య, చందు, బన్నీ వాసు తాజాగా శ్రీకాకుళం చేరుకున్నారు. ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో తమ సినిమా విశేషాలను పంచుకున్నారు.

Rashmika: నా మనసులో అతడే ఉన్నాడు.. పెళ్లి కూడా అతడితోనే: రష్మిక

నాగ చైతన్య మాట్లాడుతూ ‘‘సుమారు ఆరు నెలల క్రితం చందూ మొండేటి నాకు ఈ కథ చెప్పారు. ఇది నాలో స్ఫూర్తి నింపింది. మత్స్యకారుల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చా’’ అని చెప్పారు. అనంతరం బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘‘నిజ జీవితంలో జరిగిన కథను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్నాం. వాస్తవిక పరిస్థితులకు దగ్గరగా చూపించనున్నాం. సిక్కోలు మత్స్యకారుల యాస, భాష, వ్యవహార శైలిని అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రాంతానికి వచ్చాం. ఒక మంచి లవ్‌స్టోరీని సైతం ఈ సినిమాలో చూపించనున్నాం’’ అని చెప్పారు.

2018లో గుజరాత్ వెరావల్ నుండి వేటకు వెళ్లి పాక్‌ కోస్ట్‌ గార్డ్‌కు చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరైన రామారావు జీవిత నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. మత్స్యకారుల వలసలు, పాక్‌కు చిక్కడం, అక్కడి నుంచి భారత్‌కు రావడం వంటి ఇతి వృత్తంతో ఇది సిద్ధం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని