Navadeep: యాంకర్‌తో డేటింగ్‌.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన నవదీప్‌

యాంకర్‌తో డేటింగ్‌ అంటూ తనపై వస్తోన్న రూమర్స్‌పై నటుడు నవదీప్‌ స్పందించారు.

Published : 06 Apr 2024 20:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను యాంకర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై నటుడు నవదీప్ (Navadeep) స్పందించారు. తన తాజా చిత్రం ‘లవ్‌మౌళి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు. ‘స్నేహితురాలితో బయట కనిపించినా ఊహించుకుని ఏవేవో రాస్తారు. నేను ఒక యాంకర్‌తో డేటింగ్‌ చేస్తున్నట్లు.. పెళ్లి చేసుకోనున్నట్లు రాశారు. అవ్వన్నీ రూమర్స్‌. అలాంటివి పట్టించుకోను. నేను ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నా’ అన్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లవ్‌మౌళి’. ఫంకూరీ గిద్వానీ కథానాయిక. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఇటీవల నవదీప్ మాట్లాడుతూ.. ‘‘నేను గత కొన్నేళ్లలో వేరే వేరే సినిమాలు.. అనవసరమైన చిత్రాలు చాలా చేశా. లాక్‌డౌన్‌లో కొంత విరామం తీసుకొని నా బలం ఏమిటో తెలుసుకున్నా. ఆ కోవలోనే విన్న కథ ఇది. నా ఆలోచనా విధానానికి, నేను చేయాలనుకుంటున్న సినిమాలకు ఈ చిత్రం దగ్గరగా అనిపించింది’’ అన్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని