Thangalaan: తంగలాన్‌ వచ్చేది అప్పుడే.. అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌

విక్రమ్‌ హీరోగా నటించిన ‘తంగలాన్‌’ చిత్రం విడుదల ఎప్పుడో దర్శకుడు తెలిపారు.

Published : 13 Mar 2024 19:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విక్రమ్‌ (Vikram) హీరోగా పా. రంజిత్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). ఈ సినిమాపై తమిళనాడు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి. అనివార్య కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదాపడుతూనే వస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు పా. రంజిత్‌ రిలీజ్‌ గురించి మాట్లాడారు. ‘‘ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. సెన్సార్‌ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేస్తున్నాం. ప్రస్తుతం ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం. ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమా విడుదల చేస్తాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని పా. రంజిత్‌ పేర్కొన్నారు.

కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమ్‌ ప్రయోగాత్మక లుక్‌లో కనిపించనున్నారు. మాళవిక మోహనన్‌, పార్వతీ తిరువోతు కీలక పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని