Papam Pasivadu: స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘పాపం పసివాడు’.. ఎప్పుడంటే?

సింగర్‌ శ్రీరామ చంద్ర ప్రధానపాత్రలో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ ‘పాపం పసివాడు’ (Papam pasivadu). తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు.

Updated : 23 Sep 2023 20:58 IST

హైదరాబాద్‌: గాయకుడు శ్రీరామ చంద్ర, గాయత్రి చాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘పాపం పసివాడు’ (Papam pasivadu). వీకెండ్‌ షో బ్యానర్‌పై ఇది తెరకెక్కింది. తాజాగా దీని ట్రైలర్‌ను దర్శకుడు సందీప్‌ రాజ్‌ విడుదల చేశారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఇది అలరించనుంది. లవ్‌ ఫెయిల్‌ అయిన అబ్బాయిని ముగ్గురు అమ్మాయిలు ప్రేమిస్తే ఎలా ఉంటుందన్నది కథ. ఐదు ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌.. ఆహా (aha) వేదికగా సెప్టెంబర్‌ 29 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ఈ ట్రైలర్‌ లాంఛ్‌లో దర్శకుడు సందీప్‌ రాజ్‌ మాట్లాడుతూ ప్రేమ, కామెడీ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ సిరీస్‌ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుందన్నారు. అలాగే ఆహాతోనే తన కెరీర్‌ ప్రారంభమైందని శ్రీరామచంద్ర తెలిపారు. ‘ఆహాతో కలిసి పనిచేయడం ఇది మూడోసారి. ఇక్కడే యాంకర్‌గా నా జర్నీ మొదలు పెట్టిన నేను.. ఇప్పుడు ‘పాపం పసివాడు’తో యాక్టర్‌గా మారాను. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను అందరూ ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని