Vairamuthu: ఇలాంటి వాడికి అలాంటి అవార్డా?

కోలీవుడ్‌ ప్రముఖ పాటల రచయిత వైరముత్తుకు ప్రఖ్యాత ఓఎన్‌వీ అవార్డు ఇవ్వడం పట్ల మలయాళీ నటి పార్వతీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది మహిళల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అలాంటి వ్యక్తికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఓఎన్‌వీ అవార్డు ఎలా ఇచ్చారంటూ ఆమె ప్రశ్నించారు.

Published : 28 May 2021 18:31 IST

ఇదెక్కడి న్యాయం!

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ పాటల రచయిత వైరముత్తుకు ప్రఖ్యాత ఓఎన్‌వీ అవార్డు ఇవ్వడం పట్ల మలయాళీ నటి పార్వతీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది మహిళల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అలాంటి వ్యక్తికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఓఎన్‌వీ అవార్డు ఎలా ఇచ్చారంటూ ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఇదెక్కడి న్యాయం!’ అంటూ జ్యూరీ సభ్యులను ప్రశ్నించారు.

‘ఓఎన్‌వీ కురుప్‌ (KURUP) మనకెంతో గర్వకారణం. రచయితగా ఆయన అందించిన సేవలు ఎంతో అమూల్యమైనవి. ఆయన రచనలు ప్రతిఒక్కర్నీ ఎంతగానో మెప్పించాయి. అలాంటి మహనీయుడి పేరుతో ఉన్న అవార్డును లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ఈ వ్యక్తికి ఇచ్చి ఎలా అగౌరవపరుస్తారు?గోపాలకృష్ణన్‌తో పాటు జ్యూరీలో ఉన్న సభ్యులందరూ న్యాయం చెప్పాలి’ అని పార్వతీ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికే 17 మంది మహిళలు వైరముత్తు మీద ఆరోపణలు చేశారని.. వీళ్లే కాకుండా ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో ఎవ్వరికీ పూర్తిగా తెలియదని ఆమె ఆరోపించారు. మరోవైపు ప్రముఖ గాయని చిన్మయి సైతం వైరముత్తుకు అవార్డు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని