పవన్‌కల్యాణ్‌ ఇన్‌స్టా ఫేక్‌ అకౌంట్స్‌.. ఫాలోవర్స్‌ ఎంత మందో తెలుసా?

pawan kalyan: సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ ఇన్‌స్టాలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పేరుతో ఇన్‌స్టా వేదికగా ఉన్న పలు ఫేక్‌ ఖాతాలకు అధిక సంఖ్యలో ఫాలోవర్స్‌ ఉండటం గమనార్హం.

Published : 05 Jul 2023 01:23 IST

హైదరాబాద్‌: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చిన గంటల వ్యవధిలోనే మిలియన్‌ ఫాలోవర్స్‌ దాటేశారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ పేరుతో ఇన్‌స్టాలో అనేక ఫేక్‌ ఖాతాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా భారీగా ఫాలోవర్స్‌ ఉండటం గమనార్హం. పవన్‌ కల్యాణ్‌.కొణిదెల ఖాతాను 3.84లక్షల మంది అనుసరిస్తుండగా, పవన్‌కల్యాణ్‌.కె అనే ఖాతాను 3.58లక్షల మంది ఫాలో అవుతున్నారు. pspk.in ఖాతాను 1.64లక్షల మంది అనుసరిస్తున్నారు.

ఇక పవన్‌ ఇన్‌స్టా ఖాతా విషయానికొస్తే, ట్విటర్‌ ఖాతాకు జత చేసిన ప్రొఫైల్ ఫొటోనే ఇన్ స్టాగ్రామ్‌కు కూడా వినియోగించారు. ప్రస్తుతం ట్విటర్‌ వేదికగా ఆయన రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టా వేదికగా రాజకీయాలతో పాటు, సినిమా విశేషాలను కూడా షేర్‌ చేయనున్నట్లు సమాచారం. ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో .. జై హింద్!” అనే స్లోగన్‌ను ఇన్‌స్టా ఖాతాలో ఉంచారు. సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి ఆయన నటించిన ‘బ్రో’ జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్రఖని దర్శకుడు. దీంతో పాటు, సుజిత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’లో నటిస్తున్నారు. ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తయింది. మరోవైపు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’లో చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడితో పీరియాడికల్ మూవీ ‘హరి హర వీర మల్లు’లోనూ పవన్‌ నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని